రాజకీయాల్లో 50 ఏళ్లు దాటినా ఇంకా యువనేత అనే అంటుంటారు. రాజకీయాల్లో ఓ స్థాయికి రావడానికే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. చివరకు వయస్సు ఉడిగే సమయంలో కీలక పదవులు వస్తాయి. అలాంటిది ఏకంగా ప్రధానమంత్రి కావాలంటే కనీసం 50 ఏళ్లయినా నిండాల్సిందే.

 

కానీ ఈ అమ్మాయి మాత్రం కేవలం 34 ఏళ్లకే ఏకంగా ఓ దేశానికి ప్రధాన మంత్రి అయ్యింది. ఎవరా అమ్మాయి అంటారా..? ఆమె పేరు సన్నా మారిన్. ఫిన్‌ల్యాండ్‌ ప్రధానిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతోందీ అమ్మాయి. 34 ఏళ్లకే ఆమె ప్రధాని బాధ్యతలు చేపట్టబోతోంది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయసున్న మహిళగా మారిన్‌ ఘనత సాధించబోతోంది.

 

కోరికలతో కాలిపోయే నలుగురు భామలతో ఒక్కడే మగాడు.. ఎలా తట్టుకున్నాడో..?

మహిళల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఆమె సారథ్యం వహించబోతోంది. మాజీ ప్రధాని అంటి రిన్నే .. దేశంలో పోస్టల్‌ సమ్మెను సరిగా నియంత్రించలేకపోయారు. అందువల్ల ఆమె తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

 

ఇక ఇప్పుడు 34 ఏళ్ల మారిన్‌ త్వరలో ప్రధాని బాధ్యతలు స్వీకరించబోతోంది. ఉక్రెయిన్‌ ప్రధాని ఒలేక్క్‌సీ హౌంచార్కు వయసు 35 ఏళ్లు. ఇక ఆమె కంటే కాస్త పెద్దదైన న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్‌డెర్న్‌ వయసు 39 ఏళ్లు. వీళ్లే చిన్న వయస్సులోనే ప్రధానులైన మహిళలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: