హస్తిన లో విందు రాజకీయం ద్వారా నరసరాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సొంత పార్టీ నాయకత్వానికి తన సత్తా ఏపాటిదో రుచి చూపించాలని సన్నాహాలు చేసుకుంటుండగా , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయన ఎత్తుగడ ని తిప్పికొట్టే పథక రచన చేశారు . రామకృష్ణం రాజు ఇటీవల బీజేపీ కి చేరువవుతున్న విషయాన్ని గ్రహించిన జగన్ , ఒకవేళ అయన  చేజారితే ప్రత్యామ్నాయం కోసం అన్నట్టు గా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీ ని వైస్సార్ కాంగ్రెస్ లో చేర్చుకోవడం లో సక్సెస్ అయ్యారు .

 

 గంగరాజు కుమారుడు రంగరాజు , సోదరుడు నరసింహరాజు లు సోమవారం  జగన్ సమక్షం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు .   బీజేపీ తరుపున  2014 లో  నరసాపురం  నుంచి గంగరాజు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెల్సిందే . అయితే 2019 లో గంగరాజు ఎన్నికల్లో పోటీ చేయలేదు . దీనితో అప్పటి నుంచి  గంగరాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు .  జగన్ అధికారం లోకి వచ్చిన వెంటనే కరకట్ట పై అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం లో  గంగరాజు కు చెందిన భవనాల ప్రస్తావన కూడా ప్రముఖంగా విన్పించింది .

 

అయితే గంగరాజు కుటుంబానికి కూడా సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు .   అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం ప్రస్తుతం  మరుగున పడిపోయింది . ఈ  తరుణం లో గంగరాజు తనయుడు , సోదరుడు ఇద్దరు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం హాట్ టాఫిక్ గా మారింది . ప్రస్తుత ఎంపీ కృష్ణం రాజు వైఖరి వల్ల విసిగిపోయిన పార్టీ నాయకత్వం ఆయనకు ప్రత్యామ్నాయంగా గంగరాజు కుటుంబాన్ని పార్టీ లో చేర్చుకుని ఉంటుందన్న వాదనలు విన్పిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: