రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌లు ఏమాత్రం త‌గ్గే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌డం లేదు. ఎక్క‌డ గొంగ‌ళి అన్న‌డే అన్న‌ట్లు అవే ధ‌ర‌లు కొన‌సాగుతున్నాయి. బండి లేనిదే బ‌య‌ట‌కు వెళ్ళ‌లేని పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజు రోజుకి పెరుతూనే వ‌స్తుంది. ఈ రోజు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో ఏమాత్రం మార్పులేదు. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.79.81 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.72.07 వద్దనే కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి.


ఏపీలో  కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొనింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర స్థిరంగా రూ.79.36 వద్ద కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.71.15 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.79.00 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.71.02 వద్ద నిలకడగా ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.75.00 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.66.04 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.80.65 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.69.27 వద్ద నిలకడగానే కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.22 శాతం తగ్గుదలతో 64.25 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.29 శాతం క్షీణతతో 58.85 డాలర్లకు తగ్గింది.

ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. కానీ ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా త‌గ్గిన‌ట్లు ఎక్క‌డా లేవు. పావ‌లా, అర్ధ తేడా త‌ప్పించి పెద్ద‌గా తేడా క‌నిపించ‌డం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి నెల‌కొనింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: