ఈ శతాబ్దంలో భారత దేశంలో అతి పెద్ద మార్పు ఏమిటి అంటే అది ఖచ్చితంగా ఆధార్ కార్డు అని చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో ఆధార్ కార్డు లేకపోతే అసలు మనిషిగా కూడా గుర్తించ లేకపోతున్నారు. రేషన్ కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ఆధార్ కార్డు కంపల్సరీ చేశారు మన ప్రభుత్వం. కానీ, కొంతమంది వలసదారుల కి, కార్మికులకి , పేదలకి ఇప్పటికీ ఆధార్ కార్డుకి నోచుకోవడం లేదు.

 

ఒక పక్క సుప్రీంకోర్టు ఆధార్ కార్డు కచ్చితం కాకుండా కేవలం ఐచ్చికంగా చేయాలని ఆదేశించిన కూడా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీని పై సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని మరో సారి ఆ దిశగా ఆదేశించింది.

 

 ఆధార్ లేదనే కారణంగా కొన్ని రాష్ట్రాలలో పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కొన్ని సంవత్సరాలుగా ఆపేశారు అని మాకు తెలిసింది అని చెప్పింది. దీంతో అక్కడి ప్రజలు ఆహారం దొరకక ఒక పూట తిని ఒక పూట తినక గడుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .ఆధార్ లేకుంటే అన్నం పెట్టరా అని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. ఆధార్ లేని కారణంగా అన్నం ఇవ్వకుండా వారిని చనిపోయేందుకు కారణం అయితే ఏ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఉపేక్షించదని గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

‘ఆధార్ కార్డు లేని నిరుపేదలకు ప్రభుత్వాలు రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేశాయి. దీని వల్ల తిండి లేక ఆకలితో అలమటించి.. బడుగు జీవులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలి’ అంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు  విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి: