మనుషుల బలహీనత భయం. ఇది మనిషిని ఆవహించిందంటే ఎన్నడు లేని అనుమానాలు, ఎప్పుడు కలుగని ఆలోచనలు వెన్నాడుతుంటాయి. ఇవి ఒంటరిగా ఉన్నప్పుడు మనుసులోకి ప్రవేశించి ఆందోళనను కలిగిస్తాయి. ఇక సర్వసాధారణంగా దైయ్యాలు అనే పేరు ఎప్పటి నుండో మనం వింటూనే ఉన్నాం. ఇవి ఉన్నాయా లేవా అనేది ఇప్పటికి ఒక సమాధానం లేని ప్రశ్నలా మిగిలింది. ఇకపోతే మన భారతదేశంలో ఉన్న కొన్ని రోడ్డు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు ఆ ప్రయాణికులకు కొన్ని వింత అనుభవాలు ఎదురు అయ్యాయంటున్నారు. అందుకే ఇలాంటి మార్గాలగుండా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అక్కడ దయ్యాలున్నాయని చెబుతున్నారు.

 

 

అవి ఎక్కడో మనం ఒక లుక్కు వేద్దాం... ఇకపోతే చాలా మందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ క్రింద ఇవ్వబడిన రోడ్డు మార్గాల్లో వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉందట. ప్రమాదాలు జరిగే దారిలో మొదటగా చెప్పుకోవలసింది. రాంచి - జంషెడ్ పూర్ (ఎన్ హెచ్ 33)..  ఈ హైవేపై ఊహించని రీతిలో తరచుగా జరిగే ప్రమాదాలు ఏ కారణంగా సంభవిస్తున్నాయో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ మార్గంలో రోడ్డుకు ఇరు వైపులా రెండు దేవాలయాలు ఉంటాయి. వాహనాలను నడిపే వారు ఇక్కడ ఆగి ఈ రెండు ఆలయాలను దర్శించకుండా వెళితే ఈ రోడ్డుపైనే పెద్ద ప్రమాదానికి గురవుతారని చెబుతారు. కొందరు ఈ వాదనతో బలంగా ఏకీభవిస్తారు.

 

 

ఇక రెండవది. భంగర్ కోట మార్గం (ఢిల్లీ - జైపూర్ హైవే) మూడవది సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం, తమిళనాడు.. నాలుగవది ​కాషెడి ఘాట్, ముంబై - గోవా హైవే.. ఐదవది ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డు, న్యూ ఢిల్లీ.. వీటి మార్గాల్లో ప్రయాణించే వారికి వింత వింత అనుభూతులు ఎదురయ్యాయని చెబుతున్నారు.. అప్పుడప్పుడు భయంకర మైన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయంటున్నారు. మొత్తంగా చెప్పోచ్చేది ఏంటంటే ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే ఎంతగానో గుండెధైర్యం ఉన్న అది చాలదట ఇలాంటి అనుభవాలు కొందరికి జరిగాయట. అందుకే ఎవరైన ఇటువైపు వెళ్లితే జాగ్రత్తగా ఉండమంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: