హైదరాబాద్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా రాయబారి...సావుద్ బిన్  మహమ్మద్ అస్సతి  నిన్న తెలంగాణ పరిశ్రమల ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు సహా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి గురించి సౌదీ అరేబియా రాయబారికి మంత్రి మంత్రి కేటీఆర్ వివరించారు. ఇక్కడ అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని సౌదీ అరేబియా రాయబారికి మంత్రి కేటీఆర్ తెలిపారు. 

 

 

 

 టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ఇప్పటికే ఎన్నో పెద్ద కంపెనీలు  హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేలా చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని... అలాగే సౌదీ అరేబియా వర్గాల్లో  కూడా తెలంగాణ పెట్టుబడులపై ప్రత్యేకంగా చర్చించి తెలంగాణ లో పెట్టుబడులకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని మౌలిక వసతులు ఐటీ పరిశ్రమలో వర్గాలతో సౌదీ అరేబియాలో పర్యటిస్తానని తెలిపిన మంత్రి కేటీఆర్... పెట్టుబడుల కోసం తమకు సహకరించాలని కోరారు. 

 

 

 

 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉందని కెటీఆర్ తెలిపారు. అంతేకాకుండా జీవించడానికి అత్యుత్తమ ప్రాంతాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది అంటూ సౌదీ అరేబియా రాయబారికి మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సౌదీ అరేబియా కు పెద్ద ఎత్తున ఉపాధి కోసం వెళ్తున్నారని సౌదీ అరేబియాకు తెలంగాణకు మధ్య సాంస్కృతిక సంబంధాలకు మంచి చరిత్ర ఉంది అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సౌదీ అరేబియాకు తెలంగాణకు మంచి సంబంధాలున్న నేపథ్యంలో హైదరాబాదులో సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని ఆయన సౌదీ అరేబియా రాయబారి తో చర్చించారు. కాగా ఈ భేటీలో తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ తో పాటు, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్ సహా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేయేశ్  రంజన్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: