దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో అన్ని అనుమానాలే ఉన్నాయి.  దిశ కేసులో నిందితులను ఈనెల 6 వ తేదీన చటాన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో వారిపై కాల్పులు జరిపి హతమార్చారు.  కాల్పులు జరిపే సమయంలో ఆ నలుగురు నిందితులు పోలీసులపై రాళ్ళూ రువ్వి.. గన్స్ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు చెప్తున్నారు.  


పోలీసులు చెప్తున్న విషయాలు అంతవరకు బాగానే ఉన్నది.  ఈ ఎన్ కౌంటర్ విషయంలో ఎన్ హెచ్ ఆర్ సి రంగంలోకి దిగిన తరువాత కొన్ని విషయాలు బయటపడుతున్నాయి.  అసలు ఏం జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  చటాన్ పల్లి ఫ్లైఓవర్ దగ్గర నిందితులు గన్స్ లాక్కొని  ఫైరింగ్ చేశారు బాగానే ఉన్నది.  ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులు వారిపై కాల్పులు జరపకుండా వారిని సజీవంగా పట్టుకునే ఛాన్స్ కూడా ఉన్నది.  


ఒకవేళ పారిపోకుండా ఉండాలి అంటే... మోకాళ్ళకు కింద కాలిస్తే సరిపోయేది కదా... ఎందుకు పైభాగంలో కాల్చారు అన్నది అనుమానం.  దీంతో పాటుగా, గన్స్ పట్టుకున్న మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు చేతుల్లో గన్స్ ఉన్నాయి.  వాళ్లపై మూడు మూడు రౌండ్స్ కాల్పులు జరిగినా వారు గన్స్ వదల్లేదు అంటే అర్ధం ఏంటి... గన్స్ పట్టుకొనే ఉన్నారు అంటే ఎలా అర్ధం చేసుకోవాలి.  


ఎవరైనా సరే గన్ తో షూట్ చేసినపుడు ఆ బాధకు గన్ వదిలేస్తారు.  కానీ, ఆ ఇద్దరు మాత్రం గన్స్ వదల్లేదు.  ఈ అనుమానాన్ని ఎన్ హెచ్ ఆర్ సి వ్యక్తం చేస్తున్నది.  అలానే గచ్చిబౌలిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గాయపడిన ఇద్దరు పోలీసులను మూడు గంటలకు పైగా ఎన్ హెచ్ ఆర్ సి ప్రశ్నలు సంధించింది.  దీంతో ఈ ఎన్ కౌంటర్ లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.  మరి ఈ అనుమానాలకు సమాధానాలు త్వరలోనే దొరుకుతాయని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: