రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేనాని దీక్ష చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఈ నెల 12న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జనసేన ప్రకటనను విడుదల చేసింది. జనసైనికులు, పార్టీ నేతలు భారీగా తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే షెడ్యూల్‌పై మాత్రం క్లారిటీ మాత్రం రాలేదు కానీ సోమవారం దీక్షకు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

 

 

ఇకపోతే జనసేన ఇచ్చిన ప్రకటనలో ఉన్న విషయం ఏంటంటే ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కాకినాడలో చేపట్టనున్న దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలి. ప్రతి ఒక్క జనసైనికుడు కాకినాడ చేరుకొని పవన్‌ కళ్యాణ్‌ దీక్షకు సంఘీభావం తెలపాలి’ అని  అందులో పేర్కొన్నారు.. ఇక పవన్ కళ్యాణ్ ఒక రోజు దీక్షను ‘రైతులకు బాసటగా నిలించేందుకు చేయాలని నిర్ణయించారు. కావునా ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో పవన్‌ కళ్యాణ్‌ నిరసన దీక్ష చేయనున్నారు.

 

 

రైతాంగానికి బాసటగా నిలబడటం ప్రతి ఒక్క జనసైనికుడు బాధ్యతగా భావించి కాకినాడ దీక్షకు తరలి రావాలని కోరుతున్నాను’ అంటూ జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గత ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి, రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకుని, గిట్టుబాటు ధర లేక.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఆరా తీసి, రైతు సమస్యలపై దీక్ష చేస్తానని ప్రకటించారు.

 

 

చెప్పినట్లుగానే ఈ నెల 12న దీక్షకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు పడిన కష్టాలపై పవన్ ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: