ప్రస్తుతం లోకం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలు కనీస రక్షణ లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఒకప్పుడు బయటి వారితోనే భయంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో వారితో కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి అసలు భూమ్మీద మహిళగా  పుట్టడమే తప్ప అనుకునేంతలో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బయటి వాళ్ల నుంచి లైంగిక వేధింపులు ఎదురైతే ఇంట్లో వాళ్ళు నుంచి రక్షణ దొరుకుతుంది అని మహిళలు  భావిస్తుంటే అటు ఇంట్లో వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి మహిళల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. అటు ఎన్ని కఠిన  చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. 

 

 

 వదిన అంటే అమ్మ తర్వాత అమ్మతో సమానం అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు మరుదులు మాత్రం అమ్మలాంటి వదినగా పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకో విషయం ఏంటంటే తన ఇద్దరు తమ్ముళ్లు తన భార్యపై అత్యాచారం చేసేందుకు భర్త అత్తమామలు కూడా సహకరించడం దారుణమైన ఘటన. సభ్య సమాజం తలదించుకునే ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా బాధితురాలు ఈ ఘోరాన్ని గుంటూరు అర్బన్ లో  నిర్వహించిన స్పందన కార్యక్రమం లో తన బాధను వెళ్లగక్కుకుని  కన్నీటి పర్యంతమైంది. తన భర్త అత్తమామలు సహకారంతో తన ఇద్దరు మరుదులు లైంగికంగా దాడి చేశారు అంటూ బోరున విలపించింది బాధితురాలు. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... పాత గుంటూరుకు చెందిన బాధితురాలికి 2011లో వివాహమైంది. కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన మామ కాళ్ళు పట్టాలి అంటూ కుటుంబ సభ్యులు ఆ మహిళపై ఒత్తిడి తీసుకు రావడం మొదలుపెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు చేప్పినట్లుగానే మామ కాళ్ళు నొక్కేది ఆ  మహిళ. తండ్రి తరువాత తండ్రిలా కోడల్ని చేరదీయాల్సిన  మామ కాస్త బాధిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించే వాడు. ఆ తర్వాత తన ఇద్దరు మరుదులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఇక నాలుగు మరిది పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక అత్యాచారం చేశాడు. అయితే ఈ విషయాన్ని భర్త దగ్గర చెబితే అయినా  న్యాయం జరుగుతుందని భావించిన ఆ మహిళ... భర్త దగ్గర జరిగిన ఘోరాన్ని వివరించింది.

 

 

 

 కానీ భర్త మాత్రం అలా ఇష్టమైతేనే ఉండాలని లేదంటే ఇంట్లోంచి  వెళ్ళిపోవాలి అంటూ అవమానియా  సమాధానమిచ్చాడు. వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ ఉండడంతో వారి పై వేధింపుల కేసు పెట్టింది సదరు బాధిత మహిళ. దీనికి బదులుగా ఆ కుటుంబ సభ్యులు మొత్తం బాధిత మహిళ పై దొంగతనం కేసు మోపి అరెస్టు చేయించాడు. ఇప్పుడు విడాకులు ఇవ్వాలంటు  బెదిరిస్తున్నారని తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ బాధితురాలు స్పందన కార్యక్రమంలో తన బాధను చెప్పి  కన్నీళ్లు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: