ఈ రోజుల్లో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉద్యోగం చేస్తే నెల రోజులకు జీతం వస్తుంది... అదే  దొంగతనం చేస్తే ఒక్క రోజులో భారీగా డబ్బులు సంపాదించవచ్చు అని ఎక్కువమంది దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక ఇంకొంతమంది లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి ఎంత మంచి సాలరీ వచ్చిన లగ్జరీ లైఫ్ కి సరిపోకపోవడంతో దొంగలుగా మారిపోతున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి అలాగే చేశాడు. సీరియల్లో నటించడం ద్వారా వస్తున్న డబ్బు తన లక్సరీ లైఫ్ కి  సరిపోవడంలేదని.. నటుడు కాస్త దొంగ గా మారిపోయాడు. ఇంకేముంది దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటు దొంగ సొమ్ముతో జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు ఇక్కడ ఓ సీరియల్ నటుడు. 

 

 

 కానీ ఎంతటి దొంగ అయినా చివరికి పోలీసులకు చిక్కాల్సిందే  కదా. ఇక్కడ దొంగ కూడా పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ కూకట్పల్లి లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నాగారం వికాస్ నగర్ కు చెందిన బలిజ విక్కీ టీవీ సీరియల్ లో నటిస్తూ ఉంటాడు. అయితే నటన ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. అయినప్పటికీ నటన ద్వారా వస్తున్న డబ్బులు తమ జల్సాలకు సరిపోకపోవడంతో 2018 సంవత్సరంలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది చోరీలు చేయడం మొదలెట్టేశాడు. కాని చివరికి కటకటాలపాలయ్యాడు. 

 

 

 

 కాగా ఈ దొంగ పై కుషాయిగూడ,  ఉస్మానియా యూనివర్సిటీ,  నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏకంగా తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఓయూ పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేయగా కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి ఈ ఏడాది ఆగస్టు 9న బయటకు వచ్చాడు విక్కీ. అయినప్పటికీ తన ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. నవంబర్ 15న కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ లో ఓ అపార్ట్మెంట్లో చొరబడి తాళం పగలకొట్టి మరి మూడు వందల గ్రాముల బంగారం అపహరించుకుపోయాడు . ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా... అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడింది పాత దొంగ విక్కీ నేనని పోలీసులు నిర్ధారించారు. ఇక విక్కిని తన ఇంట్లో అదుపులోకి తీసుకుని అతని నుంచి 12 లక్షల విలువైన 330 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి వికీపై పిడి యాక్ట్  ప్రయోగించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: