షాద్ నగర్ లో చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. అయితే ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. అయితే వారిని కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. 

 

అయితే ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. అయితే ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు చేసుకున్నారు. 

 

కాగా ఈ ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని హైకోర్టులో మహిళా, పౌరహక్కుల సంఘాల నేతలు పిటిషన్ దాఖలు చెయ్యగా నేడు విచారణ జరిపిన కోర్టు మళ్ళి వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దిశ అత్యాచారంలో నింధితులు, బాధితురాలి తల్లిదండ్రులను మానవహక్కు సంఘాల అధికారులు విచారించారు. అయితే ఆ విచారణలో సంచలన నిజాలు బయట పడ్డాయి. 

 

అవి ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి.. మొదటి నుండి వారి ఫోటోలు చూసినప్పుడు మైనర్లు అనుకున్నాం కదా.. కానీ వారు మైనర్లు కాదు అని తేలింది కదా. అయితే ఆ కేసులో మైనర్లు లేరు అని సజ్జనార్ తేల్చి చెప్పారు. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం ఇద్దరు మైనర్లు అని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. 

 

దిశ కేసులో ఇద్దరు మైనర్లు ఉన్నట్టు.. ప్రధాన నిందితుడు ఆరిఫ్ కు 26 సంవత్సరాలు.. శివ, నవీన్, చెన్నకేశవులు 20 ఏళ్ళు ఉంటాయని సీపీ సజ్జనార్ తేల్చి చెప్పాడు. కానీ వారిలో ఇద్దరు తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకులు మైనర్లు అని కూడా చూడకుండా ఎన్కౌంటర్ చేసారని మానవ హక్కుల సంఘం అధికారులకు చెప్పినట్టు సమాచారం. దీంతో మానవ హక్కుల బృందం మృతుల సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు పరిశీలించగా.. వారి పుట్టిన తేదీలు వేర్వేరు ఉండటంతో కేసు మరో మలుపు తిరిగింది. ఏది ఏమైనా మినార్లగా ఉన్నప్పుడే ఇంత చేస్తే మేజర్లు అవుతే ఇంకెంత చేసేవాళ్ళో.. వాళ్ళు ఎన్కౌంటర్ గురవ్వడమే మంచిదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: