అసెంబ్లీ రెండోరోజు సమావేశాలను  తెలుగుదేశంపార్టీ తిరుగుబాటు ఎంఎల్ఏ వల్లభనేని వంశీ హీటెక్కించారు. ప్రశ్నోత్తరాలు మొదలు కాకముందే మాట్లాడాలంటూ వంశీ చేయెత్తాడు. దాంతో స్పీకర్ తమ్మినేని సీతారం అనుమతించారు. వంశీ తన సీట్లో నుండి లేచి మాట్లాడటం మొదలుపెట్టగానే టిడిపి సభ్యులు పెద్ద ఎత్తున గోల మొదలుపెట్టారు. వంశీ మాట్లాడేందుకు లేదంటూ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

 

నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం తాను జగన్మోహన్ రెడ్డిని కలవగానే టిడిపి తనను సస్పెండ్ చేయటమేంటి ? అంటూ అమాయకంగా ప్రశ్నించారు. దాంతో టిడిపి ఎంఎల్ఏలు వంశీని మాట్లాడనీయకుండా అడ్డు తగులుతూ గందరగోళం మొదలుపెట్టారు.  ఈ గోలలోనే చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు అండ్ కో వంశీని ధూషించటం మొదలుపెట్టారు.

 

టిడిపి సభ్యుల వైఖరితో విసిగిపోయిన స్పీకర్ వారిని మందలించారు. సభలో తన అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ ప్రతి సభ్యుడికి ఉంది కాబట్టి మాట్లాడనీయమని  స్పీకర్ చెప్పినా టిడిపి ఎంఎల్ఏలు అంగీకరించలేదు. దాంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి జోక్యం చేసుకుని సభ్యుడిని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం స్పీకర్ విచక్షణాధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు.

 

దాంతో స్పీకర్ వంశీని మాట్లాడేందుకు అనుమతించారు. ఎప్పుడైతే వంశీ మాట్లాడటం మొదలుపెట్టారో చంద్రబాబు సభలో నుండి బయటకు వెళ్ళిపోవటమే విచిత్రంగా ఉంది. అంటే తన గురించో లేకపోతే లోకేష్ గురించో మాట్లాడుతారని చంద్రబాబు అనుమానించారు. అందుకనే వంశీ స్పీచ్ వినటానికి ఇష్టంలేక సభలో నుండి బయటకు వెళ్ళిపోయారు.

 

సరే అందరూ అనుకున్నట్లే వంశీ కూడా చంద్రబాబు వైఖరితో పాటు లోకేష్ పైన కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు వైఖరిని ఆమోదించలేకే తాను టిడిపికి రాజీనామా చేసినట్లు చెప్పారు. టిడిపిలో ఉన్నపుడు తనకు ఎదురైన అవమానాలను కూడా వివరించారు. ఎప్పుడైతే వంశీ మాట్లాడటం మొదలుపెట్టారో చంద్రబాబుతో పాటు మిగిలిన ఎంఎల్ఏలు కూడా సభలో నుండి బయటకు వెళ్ళిపోవటమే విచిత్రంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: