తెలుగుదేశంపార్టీ తిరుగుబాటు ఎంఎల్ఏ వల్లభనేని వంశీ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమయ్యే ముందే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ వంశీ చెయ్యెత్తారు. దాంతో స్పీకర్ అనుమతించగానే టిడిపి ఎంఎల్ఏలు గోల మొదలుపెట్టారు. దాంతో సభలో గందరగోళం మొదలైపోయింది.

 

సరే గందరగోళం మొదలుకాగానే చంద్రబాబునాయుడుతో కలిసి చాలామంది టిడిపి ఎంఎల్ఏలు సభలో నుండి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత వంశీ మాట్లాడుతూ తాను టిడిపిలో కొనసాగే అవకాశం లేదన్నారు. కాబట్టి తనను స్వతంత్ర ఎంఎల్ఏగా కొనసాగేందుకు అనుమతించాలని విజ్ఞప్లా చేశారు. ముందు తాను ఎంఎల్ఏ పదివికి రాజీనామా చేద్దామని అనుకున్నా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే ఎంఎల్ఏగా కంటిన్యు అవుదామని నిర్ణయించుకున్నట్లు కూడా చెప్పారు.

 

జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజోపయోగాల గురించి ప్రశంసించారు. పథకాలను అభినందించారు. ఇండిపెండెంట్ సభ్యునిగా గుర్తించాలన్న వంశీ విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారు. వంశీ విజ్ఞప్తిపై నిబంధనలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి వరకూ సభలోనే ఖాళీగా ఉన్న సీట్లలో ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ కూర్చోవచ్చని సూచించారు.

 

దాంతో వంశీ మాట్లాడుతూ ఇపుడు కూర్చుంటున్న స్ధానంలోనే కూర్చుంటానని చెప్పారు. అంటే టిడిపి సభ్యులు కూర్చునే వరసలోనే అందరికన్నా  చివరలో కూర్చున్నారు.  వంశీ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించి ఇండిపెండెంట్ సభ్యునిగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. దీంతో టిడిపిని వదిలేయాలని అనుకుంటున్న మరికొందరు  ఎంఎల్ఏలకు స్పీకర్ నిర్ణయం బాగా ఊతమిచ్చేదిగానే ఉంది.

 

ఇప్పటికే టిడిపి నుండి కనీసం పదిమంది ఎంఎల్ఏలు రాజీనామా చేసి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. కాకపోతే రాజీనామా చేసినా లేకపోతే రాజీనామా చేయకుండానే పార్టీ మారినా సభ్యత్వం పోతుందన్న భయంతోనే టిడిపిలో కంటిన్యు అవుతున్నారు. అటువంటి ఎంఎల్ఏలకు వంశీ ఉదంతం తాజా ఉదాహరణగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: