ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గన్నవరం ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ సీఎం జగన్ గారిని కొన్ని రోజుల క్రితం పేద ప్రజల ఇంటి స్థలాల కోసం కలిశానని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వలన ఇవ్వలేకపోయామని అన్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసినందుకు ఎందుకు సీఎం జగన్ ను కలిశావని కలవాల్సిన అవసరం ఏముందని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వార్తాపత్రికల ద్వారా తెలియపరిచారని అన్నారు. 
 
ముఖ్యమంత్రిగారిని అధికారంలోకి వచ్చిన తరువాత కలవడం మొదటిసారి కాదని చెబుతూ ఉన్న సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు గట్టిగా అరుస్తూ గోల చేశారు. వంశీ మాట్లాడుతూ చంద్రబాబు ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. గతంలో కూడా ముఖ్యమంత్రిగారిని కలిశానని టీడీపీ ఎమ్మెల్యేలు గోల చేస్తుంటే మాకు కూడా హక్కులు ఉంటాయి కదా...? అని వంశీ అన్నారు. స్పీకర్ జోక్యం చేసుకొని టీడీపీ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పారు. 
 
పోలవరం కుడి కాలువ మోటర్ల గురించి గతంలో సీఎం జగన్ ను కలిశానని వంశీ చెప్పారు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో నాపై బురద చల్లే ప్రయత్నం టీడీపీ నేతలు చేశారని అన్నారు. మోటార్లకు కరెంట్ కోసం సీఎంను కలిశానని రైతులకు మంచి జరుగుతుందని సీఎం జగన్ ను కోరగా రైతులకు కరెంట్ ఇవ్వటానికి సీఎం ఒప్పుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా స్థలాలు లేవని, ఆర్డీవో సంతకాలు లేవని వంశీ అన్నారు. 
 
సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఉండటంపై జగన్ ను అభినందించానని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని వంశీ చెప్పారు. తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకు మారినపుడు చాలా ఇబ్బందులు పడ్డానని వంశీ చెప్పారు. పప్పు అండ్ బ్యాచ్ ట్విట్టర్లో దుర్భాషలాడుతారని వంశీ అన్నారు. పప్పు అండ్ బ్యాచ్ కు జయంతికి వర్ధంతికి కూడా తెలీదని అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: