గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి చంద్రబాబు, లోకేశ్ లపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్భంగా వంశీ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. "పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు. జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు విమర్శలు చేస్తున్నారు. గుడెద్దు ముసిలి ఎద్దు నాపై విమర్శలు చేస్తున్నారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు.. అంటూ మండిపడ్డారు వంశీ.

 

నేను టీడీపీ సభ్యుడునే నాకు మాట్లాడే హక్కు లేదా. నేను టీడీపీతో ఉండలేను.. అంటూ కుండబద్దలు కొట్టారు. అయితే అసెంబ్లీలో సభలో వంశీ మాట్లాడుతున్న సమయంలో.. ఆయన మాట్లాడటానికి వీళ్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వంశీ అనర్హుడని చంద్రబాబు కామెంట్ చేశారు. అంతే ఇక వంశీ మరోసారి రెచ్చిపోయారు. తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్‌ చేస్తారా? అంటూ చంద్రబాబును నిలదీశారు.

 

 

గతంలోనూ తాను అనేక సందర్భాల్లో సీఎం జగన్‌ను కలిశానని, పోలవరం కాలువ సమస్యలపై ఆయనతో చర్చించానని వంశీ గుర్తుచేశారు. ‘ఇళ్ల పట్టాలు, పోలవరం కుడి కాలువ రైతులు గురించి సీఎం జగన్‌ను కలిశాను. నా నియోజకవర్గ సమస్యలు సీఎంకు చెప్పుకున్నాను. మానవతా దృక్పథంతో సీఎం సానుకూలంగా స్పందించారు. తరువాత నాపై చంద్రబాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్నారు వంశీ.

 

 

సీఎం ఇంగ్లీష్ మీడియం పెట్టాన్ని స్వాగతించాను.పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగ పడుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వలన పేదలు ఎంతో లాభపడ్డారు. ఫీజ్ రియంబర్స్ మెంట్ ఆరోగ్య శ్రీ వలన ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇంగ్లీష్ మీడియం వలన సమాజం బాగుపడుతుంది. అమ్మఒడి వలన పేద పిల్లల మేలు జరుగుతుందని వంశీ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: