తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేయటానికి 13 మంది ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారా ? వైసిపి ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీల మధ్య వేడి పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు లాబీల్లో మాట్లాడుతూ భే షరతుగా తమ పార్టీలో చేరటానికి 13 మంది ఎంఎల్ఏలు రెడీగా ఉన్నట్లు కోటంరెడ్డి చెప్పటం సంచలనంగా మారింది.

 

నిజానికి ఇంతసంఖ్య అని చెప్పేందుకు వీల్లేదుకానీ చాలామంది ఎంఎల్ఏలు టిడిపికి రాజీనామా చేయటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుగుదేశంపార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారేముందు ఎంఎల్ఏగా రాజీనామా చేయాల్సిందే అన్న జగన్మోహన్ రెడ్డి షరతుకు భయపడే చాలామంది టిడిపి ఎంఎల్ఏలు ఇంకా పార్టీలోనే ఉన్నారు. జగన్ గనుక షరతు విధించకపోతే  టిడిపి ఎప్పుడో నేలమట్టమైపోయేదే.

 

చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష హోదా ఇంకా ఉందంటే అందుకు కారణం జగనే అని చెప్పక్క తప్పదు. చంద్రబాబు చేసినట్లే జగన్ కూడా చేయాలని అనుకుంటే ఈపాటికే టిడిపి ఫినిష్ అయిపోయేదనటంలో సందేహమే లేదు. ఆ విషయం తెలిసికూడా చంద్రబాబు ప్రతిచిన్నదానికి జగన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. దాంతో జగన్ కు కూడా చికాకుగానే ఉంది.

 

అందుకనే టిడిపి నుండి బయటకు వచ్చేస్తామంటున్న ఎంఎల్ఏలను ముందు రాజీనామాలు చేసి వచ్చేయమంటున్నారు. గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఈ పద్దతిలోనే టిడిపికి రాజీనామా చేశారు. తాజా పరిణామాల్లో తనను స్వతంత్ర ఎంఎల్ఏగా గుర్తించాలని వంశీ చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారు.

 

తాజా పరిణమాల నేపధ్యంలో వంశీ బాటలోనే మరికొందరు ఎంఎల్ఏలు కూడా నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిజంగా అదేగనుక జరిగితే అసెంబ్లీలో ఇండిపెండెంట్ ఎంఎల్ఏల గ్రూపే టిడిపికన్నా పెద్దదవుతుంది. అప్పుడు చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందనటంలో సందేహం లేదు. అప్పుడు చూడాలి అసెంబ్లీలో చంద్రబాబు, ఎల్లోమీడియా ఏ విధంగా గోల చేస్తారో. అందుకనే పెద్దలన్నారు ’నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: