తొలి రోజు అసెంబ్లీ సమావేశాలలో ఉల్లి ధరలపై నిరసన తెలిపిన టీడీపీ.. రెండో రోజు రైతుల సమస్యలపై ఆందోళన చేసింది. టీడీపీ ప్రభుత్వం. అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల సమస్యలపై వినూత్నంగా నిరసనను తెలియజేస్తూ.. గడ్డి మోపులు, పామాయిల్ గెలలు, పత్తి మొక్కలతో నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. 

 

ఏపీ లో వ్యవసాయ దారులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందుల్లో ఉన్నారని, కానీ.. వారి పంటల్ని కొనుగోలు చేసే నాథుడే లేడని టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. ఎవరు కొనే దిక్కు లేక, గిట్టు బాటు ధర రాక రైతులు రోడ్ల పై ధాన్యం పోశారన్నారు. పామాయిల్, వేరుశెనగ రేటు కూడా తగ్గిపోయిందని.. గిట్టుబాటు ధర దేవు డెరుగు.. పంటలని కొనే నాథుడే లేడు అని వ్యాఖ్యానించారు. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా పరిస్థితి ఉందని అన్నారు. 

 

దళారీ వ్యవస్థ, ప్రభుత్వాం చేతగాని తనానికి నిదర్శనమే.. దీనికి కారణమని టీడీపీ నేత ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని కొత్త ప్రభుత్వం చెప్పిందని.. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని చెప్పారని.. మరి పంటలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇటు అసెంబ్లీలో తొలి రోజు ఉల్లి ధరల పై చర్చకు పట్టుబట్టిన టీడీపీ ఇవాళ రైతుల సమస్య పై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ నిర్ణయించింది. 

 

ఈ మేరకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని.. ఈ అంశంపై చర్చ జరిపి తీరాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీలో రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. సిన నేతలు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: