గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో  వల్లభనేని వంశీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తన టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అయితే వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ జగన్ తో  భేటీ కావడం తో... వంశీ ఇంకొన్ని రోజుల్లో వైసీపీ లోకి రావడం ఖాయమని ఆంధ్ర రాజకీయాలు చర్చలు నడిచాయి. అటు అసెంబ్లీలో కూడా వల్లభనేని వంశీ ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. 

 

 

 

 అయితే గతంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లను అంతకు ముందు  ప్రశంసించినట్టు  గానే.. తాజాగా అసెంబ్లీలో కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు వల్లభనేని వంశీ. అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని ప్రశంసించారు ఆయన. రాష్ట్ర ప్రజా సమస్యల విషయంలో జగన్ సర్కారు తీసుకుంటున్న పనులను కొంతమేర సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాను  టిడిపి అధిష్టానంతో తన అభిప్రాయాన్ని తెలపానని.. అయితే అధిష్టానం తన మాటలు వినకపొగ  టిడిపి నేతలతో ప్రెస్ మీట్ పెట్టించి  మరీ తనను బూతులు తిట్టించారు  అంటూ వల్లభనేని వంశీ తెలిపారు. ఆ తర్వాత తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న  విషయం కూడా తనకు డైరెక్టుగా చెప్పలేదని... ప్రసార మాధ్యమాల ద్వారానే  తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలుసుకున్న అని  వల్లభనేని వంశీ అన్నారు. 

 

 

 

 టిడిపిలో కొనసాగే పరిస్థితి గాని ఉద్దేశము కానీ తనకు లేదని అసెంబ్లీ వేదికగా వల్లభనేని వంశీ తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనను ఎన్నుకున్నారని.. తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని వంశీ తెలిపారు. ఇక నుంచి తాను టిడిపి పార్టీ సభ్యుడిగా చూడవద్దని... తను అసెంబ్లీలో ఒక ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ని వల్లభనేని వంశీ కోరారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా తన హక్కులను  కాపాడాలంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పీకర్కు విన్నవించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: