హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. హత్యాచార ఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేసిన సంగతి అందరికి తెలిసందే కదా. అయితే  ఈ ఘటన జరిగి అయిదు రోజులు క్రితం డిసెంబర్ 6న తెల్లవారుజామున చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం జరిగిని. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును దర్యాప్తు చేస్తున్న NHRC చేతికి కీలక ఆధారాలు దొరికాయి. 

 

Image result for దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయంలో NHRC చేతికి కీలక ఆధారాలు

 

నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . నలుగురు నిందితులూ రాళ్లు, కర్రలతో దాడి చేశారని తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి పోలీసుల నుంచి ఆయుధాలు తీసుకున్నారు అని, అవి  నిందితుల్లో ఇద్దరి వద్దే ఆయుధాలు ఉన్నాయి అని సమాచారం. మరి ఇద్దరి చేతుల్లో ఆయుధాలు ఉన్నప్పుడు నాలుగురిపైనా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? అని ఎన్‌కౌంటర్లో పాల్గొన్న జాతీయ మానవ హక్కుల సంఘం బృందం పోలీసులను సూటిగా అడిగినట్లు బాగా తెలుస్తోంది.

 

 పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రధాన నిందితులు ఆరీఫ్ శరీరంలో మూడు బుల్లెట్లు దిగాయి అని తేలింది. అయితే మూడు బుల్లెట్లు దిగినా ఆరీఫ్ గన్ వదలకుండా చేతిలో అలాగే ఎలా ఉందని సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో నిందితుడు చెన్నకేశవుల చేతిలో కూడా పిస్టల్ అలాగే ఉందన్న విషయంపై కూడా NHRC సందేహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడ్డ నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌ గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారిని NHRC బృందం సుమారు మూడు గంటల పాటు విచారించి, కీలక సమాచారం సేకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: