ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టీడీపీ నేతలు శాసన సభను వైసీపీ పార్టీ కార్యాలయం అని అన్నారని ఆ పదాన్ని వాళ్లు ఉపసంహరించుకోవాలని చెప్పారు. ఇది గౌరవ శాసనసభ, పవిత్రమైన దేవాలయం అని స్పీకర్ అన్నారు. బాధ్యత గల స్థానాల్లో ఉండి సభను పార్టీ కార్యాలయం అనడాన్ని వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నానని స్పీకర్ చెప్పారు. 
 
నేను ఒక దశలో ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ఉన్నానని స్పీకర్ అన్నారు. ఎన్టీఆర్ ను గద్దె దింపిన పాపంలో నేను కూడా భాగస్వామినే అని తమ్మినేని సీతారాం అన్నారు. నేను ఎన్టీఆర్ ను గద్దె దింపడంలో భాగస్వామిని అయినందుకు పశ్చాతాపపడ్డాడని దానికి ప్రతిఫలమే భగవంతుడు అధికారానికి 15 ఏళ్లు దూరం చేశాడని 15 ఏళ్లు తాను అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్ చెప్పారు. నా పరిమితులు నాకు తెలుసని అపరిమితమైన అధికారాలు కూడా నాకు తెలుసని స్పీకర్ అన్నారు. 
 
ఏ అధికారాలను ఎప్పుడు ఉపయోగించాలో నాకు తెలుసని స్పీకర్ చెప్పారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సన్నబియ్యం రాష్ట్రంలో ఎక్కడా సరఫరా చేయటం లేదని చెప్పారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సరఫరా చేస్తున్నామని చెప్పారు. వాలంటీర్ల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలపై చర్చించాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈరోజు సభలో పట్టుబట్టారు. 
 
స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేయటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. స్పీకర్ తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. ఆ తరువాత మరలా టీడీపీ సభ్యులు ఒక్కొక్కరిగా లోపలికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నేత వంశీ అసెంబ్లీలో మాట్లాడుతుంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. తాను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడినే కదా అని వంశీ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: