ఒకప్పటి సమాజం ఎలా ఉండేదంటే తప్పు చేసిన వారు తమ ముఖాన్ని నలుగురికి చూపించాలంటే సిగ్గుతో దాక్కునే వారు. అంతే కాకుండా మనుషుల్ని తప్పించుకుని తిరిగే వారు. మరికొందరు ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు కూడా చేసుకునే వారు. కానీ నేటి సమాజంలో తప్పుచేసి పదిమందితో ముఖం మీద ఉమ్మించుకున్న కూడా ఎలాంటి  సిగ్గు, శరం లేకుండా నలుగురిలో తిరుగుతున్నారు.

 

 

అసలు తాము చేసింది తప్పే కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అక్రమా సంబంధాల విషయంలో మనుషుల ఆలోచనలు వికృతంగా మారుతున్నాయి. నచ్చిన మగాడి మగతం కోసం ఎంతకైనా బరి తెగిస్తున్నారు. అడ్డుగా ఉన్న వారు కట్టుకున్న వాడైన, కన్న పిల్లలైనా నిర్దాక్షిణ్యంగా హతమార్చాలని చూస్తున్నారు. యవ్వనం ఉన్నంత వరకు పడక సుఖాన్ని అనుభవిస్తారు. దేహంలో పటుత్వం సడలి పోయాక ముడతలు పడిన చర్మాన్ని ముసలి వాడు కూడా పట్టించుకోడు. మరెందుకు క్షణిక సుఖం కోసం విలువైన సమయాన్ని, నిండైన జీవితాన్ని పణంగా పెడుతున్నారో అర్ధం కావడం లేదు.

 

 

ఇక ఇక్కడొక ప్రతివతగా చెప్పుకునే మహిళ కట్టుకున్న వాడిని కడతేర్చాలని ఎనిమిది లక్షల వరకు ఖర్చు కూడా చేసిందట. అతనికి భూమి మీద నూకలు బాకీ ఉన్నాయి కాబట్టి ఇంకా బ్రతికి బట్ట కట్టడాడు. ఈ వివరాలు తెలుసుకుంటే నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని బాల్నేపల్లి గ్రామానికి చెందిన తల్లం కృష్ణకు 15 సంవత్సరాల క్రితం తన అక్క కూతురు శిరీష తో వివాహమైంది. కాగా వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.. ఇక మొదటి నుంచి మేనమామతో పెళ్లి ఇష్టం లేని శిరీష అతనితో అయిష్టతతోనే కాపురం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అరటిపండ్ల వ్యాపారి సిద్ధి సాయికుమార్‌తో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో తన భర్త అడ్డు తొలగించుకుని ప్రియుడితో కలిసి ఉండాలని నీచపు ఆలోచన కలిగింది.

 

 

ఈ క్రమంలో తనదగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించింది. కాని అవి ఫలించక నవంబర్ 18వ తేదీన ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు శిరీషను గుర్తించి అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా భర్త హత్యకు వేసి ప్లాన్ మొత్తం చెప్పేసింది. ఇందులో భాగంగా ఓ ముఠాకు రూ.8లక్షల సుపారీ ఇచ్చినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఇకపోతే ఆమె చెప్పిన వివరాల ప్రకారం శిరీష ప్రియుడు సిద్ధి సాయికుమార్‌తో పాటు కుట్రలో పాల్గొన్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: