ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఇక ఈ రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగానే  జరుగుతున్నాయి. టిడిపి వైసిపి పార్టీల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన తమకు మాట్లాడేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ ఏకపక్షంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అటు వైసిపి సభ్యులు కూడా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకాలు... తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. 

 

 

 

 ఇదిలా ఉండగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వ్యవహారంలో తాను కూడా ఉన్నానంటూ అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు అధ్యక్షత వహిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం పట్ల తాను తీవ్రంగా విచారిస్తున్నాను  అంటూ సీతారాం వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వ్యవహారంలో తాను కూడా ఒక భాగం అయినందుకు 15 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నానంటూ ఆయన తెలిపారు. 

 

 

 

 అసెంబ్లీ స్పీకర్గా తనకున్న విచక్షణా అధికారంతోనే ప్రశ్నోత్తరాల సమయంలో వల్లభనేని వంశీకి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాను  అంటూ తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రశ్నోత్తరాల ను పక్కన పెట్టి ఓ సభ్యుడితో మాట్లాడించారు అంటూ టిడిపి ఎమ్మెల్యే అచ్చం నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడం పై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వైసిపి కార్యాలయంగా మార్చారు అంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యానించారని.. ఒక గౌరవప్రదమైన సభపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని చెప్పారు. అసెంబ్లీ ఏ పార్టీ జాగిరి కాదని ప్రజల జాగిరి అని స్పీకర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: