దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి ఉరి శిక్ష ఖరారు అవుతూంటాయి. అయితే.. ఖరారైనా గానీ వాటిని అమలుపరచటంలో జాప్యం జరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు చూపుతున్నారు. ఉరి వేసే తలారి లేకపోవటం.. అమలు చేసే వ్యవస్థ లేకపోవటం.. ఇలా పలు కారణాలు చూపుతున్నారు. ఇందుకు నిదర్శనమే నిర్భయ నిందితుల ఉరి. ఘటన జరిగి, శిక్ష ఖరారై ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. ఎట్టకేలకు నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు రంగం సిద్ధమైంది.

 

 

అయితే.. ఉరి అమలు చేయాల్సిన తీహార్ జైలులో తలారి లేడని జైలు వర్గాలు స్పష్టం చెందాయి. దీనికి చెన్నై సెంట్రల్ జైలు వర్గాలు.. నిందితులను తమకు అప్పగిస్తే ఉరి తీస్తామని అందుకు తగ్గ ఏర్పాట్లు మావద్ద ఉన్నాయని ఉత్తరం కూడా రాశారు. తలారి విషయంలో కూడా.. తమిళనాడుకే చెందిన ఎస్. సుభాష్ శ్రీనివాసన్ అనే హెడ్ కానిస్టేబుల్ తీహార్ జైలు అధికారులకు ఓ అర్జీ పెట్టుకున్నాడు. తీహార్ జైలులో ఉరి తీసే తలారి లేనందువల్ల తానే స్వచ్చందంగా వచ్చి ఉరి తీస్తానని.. ఆ అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు తనకేమీ చెల్లించాల్సిన అవసరం లేదని.. ఒక్క అవకాశం మాత్రం ఇవ్వాలని కోరాడు. దీనిపై జైలు అధికారుల నుంచి సమాధానం ఇంకా రాకపోయినా తీహార్ జైలులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడేళ్ల క్రితం నిర్భయ ఘటన జరిగిన రోజే నిందితులను ఉరి తీసేందుకు నిర్ణయించారు. 

 

 

బీహార్ జైలులో ఉరి తీయడానికి తగ్గ తాడును తయారు చేస్తున్నారు. వీటిని నిపుణులైన ఖైదీలే తయారు చేస్తారు. అటువంటి వారు ఉన్నారని త్వరలోనే తాళ్లను అందిస్తామన్నారు. ముఖానికి కట్టే ముసుగు ఊడిపోకుండా తాడులో ఉక్కు, ఇత్తడి తీగలు వాడతారు. ఒక్కో పొగులో 7000 వరకూ పోగులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. చివరిగా పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురును 2013లో ఉరి తీసేందుకు అవసరమైన తాళ్లను బక్సర్ ఖైదీలే తయారు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: