తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్ విజయశాంతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పై ప్రశంసల వర్షం  కురిపించారు. సీఎం మహిళల భద్రతకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తున్నానని ఆమె తెలిపారు. అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని ఆమె  అన్నారు.


ఇటీవల హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ పై జరిగిన అమానుష దాడితో యావత్తు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏపీ అసెంబ్లీ లో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదన చేసిన ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ని అభినందిస్తున్నానని తెలిపారు. 


సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా.. కొత్తగా ప్రవేశ పెట్టబోయే చట్టానికి సంబంధించిన విషయాలను జగన్ మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా మహిళల పై అసభ్య సందేశాలు పంపే వారి పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షణీయం. తెలంగాణ మహిళల భద్రత కోసం ఏపీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. అని విజయశాంతి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలని తీసుకురావటం వలన కొంత మేరా భద్రతకు ఉపయోగ పడుతుందన్నారు.  


 ముఖ్యమంత్రి జగన్ సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం చేసేలా కొత్త చట్టం తీసుకొస్తామని ఆయన తెలిపారు. మూడు వారల్లోనే శిక్ష పడేలా చట్టాన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే సోషల్ మీడియాలో మహిళల పై అసభ్యకరంగా పోస్ట్‌ లు పెడితే కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: