దేశవ్యాప్తంగా మహిళలు.. చిన్నారులు అని చూడకుండా వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు ఉరి తీస్తున్నా.. చివరికి ఎన్ కౌంటర్ చేస్తున్నా నేర ఆలోచనలు ఉన్నవారు భయపడటం లేదు. నిర్భయ ఘటన తర్వాత దేశంలో అంతటి తీవ్ర కలకలం రేపింది ‘దిశ’ హత్యాచార ఘటన. అయితే.. ఈ ఘటన కంటే కొద్దిరోజుల ముందు తెలంగాణలో జరిగిన ‘సమత’ గ్యాంగ్ రేప్ కేసు కూడా ఇప్పుడు సంచలనమైంది. ఇందుకు స్క్మబందించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

 

 

గతంలో కూడా అనేక దారుణాలకు పాల్పడిన ఈ ముగ్గురు కామాంధులు 3 నెలలుగా సమత దంపతుల కదలికలను గమనిస్తూ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే నవంబర్ 24న ఎల్లాపటార్ శివారులో మాటువేసి సమతను పొదల్లోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  బాధితురాలి కేకలు సమీపంలోని రైతు కూలీలకు వినిపించినా.. అది భార్యభర్తల గొడవ అనుకుని వారు పట్టించుకోనట్లు తెలిసింది. వీరి నేర చిట్టాను చూసి పోలీసులే విస్తుపోతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఎల్లాపటార్‌లో సమంతను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది. 

 

 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాబుద్దీన్ గతంలోనూ ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏ2గా ఉన్న షేక్‌బాబును భార్య వదిలేయడంతో గ్రామంలో జులాయిగా తిరిగేవాడని, , ఏ3 షేక్ ముక్దుం చోరీ కేసులో జైలుశిక్ష అనుభవించాడని తెలుస్తోంది. వీరు ముగ్గురూ ముఠాగా ఏర్పడి కలప స్మగ్లింగ్ చేసేవారని స్థానికులు చెబుతున్నారు. షాబుద్దీన్ గతంలో కోలాంగూడలో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేశాడు. తర్వాత ఎల్లాపటార్‌కు మకాం మార్చి ఓ వివాహితను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన బాధితురాలి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: