అంధ ప్రదేశ్  అసెంబ్లీలో  బియ్యం పంపిణీ పైవాడీ వేడి చర్చ నిర్వహించడం జరిగింది. సన్నబియ్యం అని చెప్పి నాణ్యమైన బియ్యంగా అబద్దం చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అసెంబ్లీలో ఒక్కసారిగా యుద్ద వాతావరణం ఏర్పడింది. దీని పై సీఎం జగన్ కలుగజేసుకొని మాట్లాడారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే… 


 
మేం మ్యానిఫెస్టోలో సన్నబియ్యం అని చెప్పలేదు.  అయినా కూడా అందరికి నాణ్యమైన బియ్యం అందజేయాలని నిర్ణయించాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రమంతా స్వర్ణమసూరి బియ్యాన్ని అందజేస్తాం. ఈ బియ్యాన్ని పంపిణి చేయడం కోసం అదనంగా రూ.1400 కోట్లు కేటాయిస్తున్నాం. ప్రజలందరికి రూ.1 కే కిలో బియ్యం అందజేస్తాం. ఈ బియ్యం విలువ మార్కెట్ లో కిలో రూ.37. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో అమలు చేస్తున్నాం అని తెలియచేయడం జరిగింది. టీడీపీ హయాంలో కంటే మెరుగైన బియ్యాన్ని అందజేస్తున్నాం. బియ్యం గురించి తెలుసొని నాలెడ్జ్ పెంచుకోండి. ఏప్రిల్ 1 నుంచి దీనిని విజయవంతంగా అమలు చేసి చూపిస్తాం” అని సీఎం జగన్ తెలియచేయడం జరిగింది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CM' target='_blank' title='cm-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cm</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JAGAN' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> in assembly

 

ఇక మరో వైపు సన్నబియ్యం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని మంత్రి కొడాలి నాని అనడం విడ్డూరంగా ఉందని అచ్చెన్నాయుడు  తెలిపాడు. సన్నిబియ్యం సరఫరాపై టీడీపీ చేసిన ఆరోపణలకు సీఎం జగన్  ఘాటుగా సంపాందించడం జరిగింది. బియ్యం గురించి తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకోవాలని సీఎం జగన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తెలిపారు. అసలు సన్న బియ్యం అనే పేరే లేదు... స్వర్ణనే సన్నబియ్యం అంటారు... తెలియకపోతే తెలుసుకోండి... మేము ఏం చెబుతున్నామో వింటే నాలెడ్జ్ పెరుగుతుంది'' అని అన్నారు సీఎం జగన్. కళ్లద్దాలు సరి చేసుకుని మేనిఫెస్టోను చదవాలని టీడీపీ ఎమ్మెల్యేలకు తెలిపారు జగన్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: