ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాట్లాడుతూ పాదయాత్ర తరువాత మేనిఫెస్టో విడుదల చేశామని ఈ మేనిఫెస్టోనే బైబిల్, ఈ మేనిఫెస్టోనే ఖురాన్, ఈ మేనిఫెస్టోనే భగవద్గీత అని అన్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం గురించి చెప్పి ఓట్లు అడిగామని జగన్ అన్నారు. మేనిఫెస్టోలో ఎక్కడా కూడా బియ్యానికి సంబంధించిన టాపిక్ లేదని మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. 
 
చంద్రబాబు హయాంలో పంపిణీ చేసిన బియ్యం ప్రజలు తినలేకపోయేవారని చెప్పారు. ఇచ్చే బియ్యాన్ని ప్రజలు తినలేకపోతున్నారని ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టామని జగన్ చెప్పారు. ఇంతకుముందు తినలేని పరిస్థితి నుండి ఇప్పుడు ప్రజలు సంతోషంగా, ఆనందంగా తినే పరిస్థితి వచ్చిందని జగన్ చెప్పారు. మేనిఫెస్టోను తొలగించిన చరిత్ర టీడీపీది అని జగన్ అన్నారు. 
 
ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే 1400 కోట్ల రూపాయలు బియ్యం కొనుగోలు కోసం అధికంగా ఖర్చు పెడుతున్నామని చెప్పారు. క్వాలిటీతో కూడిన బియ్యం పేదవాడికి అందించాలని పేదవాడు తినాలని పేదవాడు బియ్యం అమ్ముకునే పరిస్థితి ఉండకూడదని అన్నారు. నూకల శాతాన్ని 15 శాతానికి, డ్యామేజీ శాతాన్ని 0.75 శాతానికి మించకూడదని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 
 
క్వాలిటీ పెరగడం వలన ప్రజలు శ్రీకాకుళంలో బియ్యం తినగలుగుతున్నారని జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఏప్రిల్ నెల నుండి క్వాలిటీతో కూడిన నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నామని సీఎం జగన్ చెప్పారు. పాదయాత్రలో ప్రజల నుండి అనేక సూచనలు తీసుకున్నానని సీఎం జగన్ గుర్తు చేశారు. వైసీపీ మంత్రి శ్రీరంగనాథ రాజు 25 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం ఏప్రిల్ నెల నుండి పంపిణీ చేయటం కొరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: