ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు రోజురోజుకూ విచ్చలవిడిగా పెరిగి పోతున్నాయి. అక్రమ సంబంధాల వల్ల ఎన్నో కాపురాల్లో చిచ్చు రేపుతోంది. ఈ అక్రమ సంబంధాల వల్ల చివరకు హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఫలితంగా పండంటి కాపురం కూలిపోయి పిల్లలు అనాథలు అవుతున్నారు. అయినా సరే తల్లిదండ్రుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. కేవలం కొన్ని నిమిషాల సుఖం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉండటం తో... తమతో పాటు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది.

 

ఈ క్రమంలోనే తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఓ అక్రమసంబంధం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ వ్యవహారం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు ... వంటింట్లో ప్రియురాలు సినిమా సీన్‌ను రిపీట్ చేసేలా ఉంది.   ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో నివసిస్తున్న దంపలు ఇద్దరూ డాక్టర్లు. వారు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ అయిన తన భర్తపై డాక్టరైన భార్యకు అనుమానం వచ్చింది. తను హాస్పిటల్‌లో పనిచేసే నర్సులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్న ఆ డాక్ట‌ర్ భార్య అనుమానించింది.

 

ఈ క్ర‌మంలోనే ఓ మ‌హిళా న‌ర్సుపై అనుమానం రావ‌డంతో ఆమెను త‌న ఇంటికి తీసుకు వెళ్లింది. అక్క‌డ న‌ర్సును క‌ట్టేసి శ‌రీరంపై బ్లేడుతో దాడి చేసి గాయ‌ప‌రిచింది. మ‌రోసారి త‌న భ‌ర్త‌తో క‌నిపిస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా మరో ఇద్దరి నర్సుల సమక్షంలోనే జరిగింది. తనకు డాక్టర్ భర్తకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ మహిళా డాక్టర్ మాట వినకుండా ఆరుగంటల పాటు నర్సుకు నరకం చూపించింది.

 

ఆ త‌ర్వాత ఆ న‌ర్సు స్నేహితురాళ్ల‌తో త‌ప్పించుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన డాక్టర్ భర్త ఆమెను సంప్రదించి కేసు వాపసు తీసుకోవాల్సిందిగా కోరాడు. ఇందుకు డబ్బు ఆశ చూపించాడు. అయితే డబ్బుకు లొంగని ఆ నర్సు తాను మాత్రం ఈ కేసును వాప‌సు తీసుకోన‌ని చెపుతోంది. పోలీసులు ఈ కేసును విచార‌ణ చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: