ఏపీలో జరుగుతున్న అసెంబ్లీలో సమావేశాల్లో రెండో రోజున ఏపీ రాజధాని అమరావతిపై చర్చ వాడి వేడిగా జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం ఏర్పడిందని, కాబట్టి రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని.. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు.. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలని.. అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

 

 

ఇదే కాకుండా రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.. మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నపై స్పందించి, త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని.. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఇకపోతే అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని..

 

 

అదేమంటే టీడీపీ హయాంలో రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పే ప్రయత్నం చేశానన్నారు. ఇదిలా ఉండగా రాజధాని ప్రాంత రైతులకు అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యా నారాయణ చేసిన వ్యాఖ్యలతో కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పడం శుభ వార్తగానే చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే బావుంటుందని టీడీపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు..

 

 

అంతకు ముందు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సభలో తిరుమల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ భద్రతపై మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నంబర్‌ వన్‌గా ఉందని, 15 ఏళ్లు దాటిన బస్సులేవి ఆర్టీసీలో లేవని తెలిపారు. ఇదే కాకుండా చిత్తూరు జిల్లాలో 1278 బస్సులు ఫిట్‌నెస్‌గా ఉన్నాయని. తిరుమల బస్సులన్నీ నాణ్యత ప్రమాణాల మేరకే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే కాకుండా త్వరలోనే 350 ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్లు పిలుస్తామని కూడా తెలిపారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: