హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. హత్యాచార ఘటన సీన్ రీకన్‌ స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు వారిని ఎన్‌ కౌంటర్ చేసారు. అయితే  ఈ ఘటన జరిగి అయిదు రోజులు క్రితం డిసెంబర్ 6న తెల్లవారుజామున చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ యువకుల వయస్సు 20 ఏళ్ళని అయన అన్నారు. 

 

అయితే, పోలీసులు చెబుతున్నట్టు దాంట్లో నిజం లేదని, నిందితుల్లో ఇద్దరు మైనర్లని వారి పుట్టిన రోజు తేదీలను బట్టి తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం విచారణ బృందానికి తెలియజేసినట్టు సమాచారం. మైనర్లని కూడా చూడకుండా తమ కొడుకులను ఎన్‌ కౌంటర్ చేశారని నిందితుల తల్లిదండ్రులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును దర్యాప్తు చేస్తున్న NHRC చేతికి కీలక ఆధారాలు లభించాయి. 

 

నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు. నలుగురు నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నారనీ, అవి  నిందితుల్లో ఇద్దరి వద్దే ఆయుధాలు ఉన్నాయి. మరి ఇద్దరి చేతుల్లో ఆయుధాలు ఉన్నప్పుడు నలుగురిపైనా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? అని ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసుల్ని జాతీయ మానవ హక్కుల సంఘం బృందం సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

 

పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రధాన నిందితులు ఆరీఫ్ శరీరంలో మూడు బుల్లెట్లు దిగాయి. అయితే మూడు బుల్లెట్లు దిగినా ఆరీఫ్ గన్ వదలకుండా చేతిలో అలాగే ఎలా ఉందని సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరో నిందితుడు చెన్నకేశవుల చేతిలో కూడా పిస్టల్ అలాగే ఉందన్న విషయంపై కూడా NHRC సందేహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడ్డ నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌ గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని NHRC బృందం సుమారు మూడు గంటల పాటు విచారించి, కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: