ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఇక ఈ రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగానే  జరుగుతున్నాయి. టిడిపి వైసిపి పార్టీల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన తమకు మాట్లాడేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ ఏకపక్షంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అటు వైసిపి సభ్యులు కూడా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకాలు... తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరిస్తున్నారు.

 

 నేడు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెబుతున్న తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సభ కొనసాగుతున్న సమయంలోనే బీపీ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆయన కాస్త ఇబ్బందికి గురయ్యారు. వెంటనే అసెంబ్లీ సభ నుంచి బయటకు వచ్చిన ఆయన... అనంతరం వైఎస్సార్ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. కాగా ఈ విషయంపై వైద్యులకు సమాచారం అందించగా...  అక్కడికి చేరుకున్న వైద్యులు మొదట ప్రాథమిక  చికిత్స అందించి... ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

 

 అయితే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యంపై వాకబు చేసారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బీపీ పెరిగిపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారని ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పడంతో సభలో  సభ్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా అటు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న పలు నిర్ణయాలు అసెంబ్లీ వేదికగా వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: