హైదరాబాద్ లో రోడ్లపై ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలిసిన విషయమే. ఇక ట్రాఫిక్ లో ఇరుకున్నాం  అంటే ఆ రోజు ఆఫీస్ కి డుమ్మా కొట్టినట్లే . ఎందుకంటే గంటలు గంటలు అయినా ట్రాఫిక్ జామ్ మాత్రం ముందుకు కదలదు. దీంతో చాలా మంది ప్రజలు అటు ఉద్యోగాలకు వెళ్లేవారు మిగతా పనుల మీద వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పై ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెట్రోరైలు ప్రవేశపెట్టింది. ఇక మెట్రో రైలు వచ్చినప్పటి నుంచి ప్రజలకు ప్రయాణ భారం తగ్గింది. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా కాస్తయినా సమయం వృధా కాకుండా తమ తమ గమ్యాలకు చేరుకుంటున్నారు భాగ్యనగర ప్రజలు. ప్రస్తుతం భాగ్యనగర వాసులకు మెట్రో ఒక వరంలా మారిపోయింది. 

 


 ఇప్పటికే భాగ్య నగరం నలుమూలల మెట్రో సేవలు విస్తరిస్తున్నాయి. ఇక అటు ప్రజలు కూడా ఎంతో మంది మెట్రో  సేవలను వినియోగించుకుంటున్నారు. దీంతో అటు మెట్రో కి కూడా రోజురోజుకు ఆదాయం పెరిగి పోతుంది. అయితే తాజాగా మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది హైదరాబాద్ మెట్రో . ఇక నుంచి మెట్రో లో ప్రయాణించే ప్రయాణికులు ఇంటర్నెట్ సేవలు ఉచితంగా పొందవచ్చని మెట్రో ప్రకటించింది. ఇక నుంచి మెట్రో రైలులో ప్రయాణించే వారు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు పొందేందుకు ఇంటర్నెట్ నెట్వర్క్  సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం షుగర్ బాక్స్ నెట్వర్క్ తో ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్ మెట్రో . 

 


 మెట్రో రైలు ఇంటర్నెట్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణికులు అందరికీ ఇంటర్నెట్ అందించనుంది షుగర్ బాక్స్ నెట్వర్క్ సంస్థ. ఇక మెట్రో లో ప్రయాణించే ప్రయాణికులు తమ మొబైల్ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేదు... ఒకవేళ మీ మొబైల్ లో డేటా అయిపోయిన చింతించాల్సిన అవసరం లేదు... ఎందుకంటే మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉచితంగా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. కాగా ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ,  ఏపీఎస్ఆర్టీసీ,  కర్ణాటక ఆర్టీసీ తో పాటు పలు  ఇతర సంస్థలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది షుగర్ బాక్స్ నెట్వర్క్ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: