పర్యాటకులను మంత్రముగ్దులను చేసే న్యూజిలాండ్‌ వైట్‌ ఐస్‌ ల్యాండ్‌ లో విషాదం నెలకొంది. పర్యాటకాన్ని ఆస్వాదించేందుకు వెళ్లిన చాలా మంది.. అగ్నిపర్వతానికి ఆహుతైపోయారు. మరికొందరు కొన ప్రాణాలతో బయటపడ్డారు.

 

న్యూజిలాండ్‌లో పర్యాటకులు భారీగా సందర్శించే వైట్‌ ఐస్‌ల్యాండ్‌లో ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలిపోయింది. దీంతో పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద ద్వీపమంతా వ్యాపించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

సోమవారం మధ్యాహ్నం రెండుగంటలకు ద్వీపంలోని అగ్నిపర్వతం పేలిపోయింది. ఆ సమయంలో ద్వీపంలో యాభై మంది సందర్శకులు ఉన్నట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 18మందికి తీవ్రంగా గాయాలైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరో 24 మంది సురక్షితం బయటపడ్డారు. 2001 తర్వాత న్యూజిలాండ్‌లోని వైట్‌ ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం పేలడం ఇదే మొదటిసారి. విషయం తెలుకున్న రెస్క్యూ టీమ్‌ హెలికాప్టర్‌ సాయంతో అక్కడికి చేరుకుంది. అయితే ఐస్‌ల్యాండ్‌కు వెళ్లడంలో వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తంగా 23 మందిని కాపాడగా, లోపల మరెందరు చిక్కుకుపోయారనేది తెలియదని అధికారులు చెప్పారు. 

 

న్యూజిలాండ్‌ తీరానికి తూర్పుదిశగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వైట్‌ ఐస్‌ల్యాండ్‌..  వాకారీ పేరుతో చాలా ఫేమస్‌. ఏటా ఇక్కడకు 10వేల మంది పర్యాటకులు వస్తుంటారు. అగ్నిపర్వతం పేలడానికి ముందు.. అక్కడ భూమిలో కంపనాలు రావడంతో కొందరు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు పేలే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు కొన్నిరోజుల క్రితమే చెప్పినా.. పర్యాటకులను ఎందుకు అనుమతించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఆహ్లాదం కోసం వెళ్లిన పర్యాటకులను తీవ్ర విషాదంలో నింపింది వైట్ ఐస్ లాండ్. తొలిసారి ఇలా జరుగడంతో అందరిలో ఒకింత ఆందోళన నెలకొంది. అటువైపు వెళ్లకపోవడమే మంచిదని వారు భావిస్తున్నారు. న్యూజిలాండ్ ఐస్ లాండ్ పేరు చెబితే  హడలిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: