నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 25 రూపాయలకు కిలో ఉల్లి అందుతోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం 25 రూపాయలకు రైతు బజార్లలో కిలో ఉల్లి అమ్ముతోంటే చంద్రబాబు హెరిటేజ్ షాపులో 200రూపాయలకు అమ్ముతున్నారని జగన్ అన్నారు. 200రూపాయలకు అమ్మే మీరా మమ్మల్ని ప్రశ్నించేది అని జగన్ అన్నారు. 
 
సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో కొంత సమయం దుమారం రేగింది. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో హెరిటేజ్ మాది కాదని అన్నారు. చంద్రబాబు అలా వ్యాఖ్యలు చేస్తే ఒక మంత్రి నాకు గిఫ్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ గురించి వివరణ ఇస్తూ హెరిటేజ్ ఫుడ్స్ తమదని హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎవరిదో, హెరిటేజ్ ప్రెష్ ఎవరిదో తెలీదా అని అన్నారు. 
 
ఈరోజు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో నారా భువనేశ్వరి మాట్లాడారు. ఉల్లి ధరలపై నారా భువనేశ్వరి స్పందిస్తూ నా జీవితంలో ఇంత భారీగా ఉల్లి రేట్లను చూడలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిధరలను తగ్గించటానికి కృషి చేయాలని నారా భువనేశ్వరి చెప్పారు. నేను అసెంబ్లీ సమావేశాలను చూడనని భువనేశ్వరి చెప్పారు. హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదని అది వేరే వాళ్లు కొనుగోలు చేశారని భువనేశ్వరి వ్యాఖ్యలు చేశారు. 
 
ఉల్లిధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని భువనేశ్వరి వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ ఫ్యూచర్ గ్రూప్స్ మాత్రమే మాకు చెందినదని భువనేశ్వరి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈరోజు అసెంబ్లీలో ఉల్లి ధరల గురించి చర్చ జరగగా ఇతర రాష్ట్రాల నుండి ఉల్లిని అధిక ధరలకు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మంత్రి కన్నబాబు అసెంబ్లీ సమావేశాల్లో ఏ రాష్ట్రంలోనేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ఉల్లికి ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: