షాద్నగర్ వైద్యురాలు దిశగా అత్యాచారం హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే దిశా  కేసులోని నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలని మొదలు పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు నిందితులను పోలీసులు కస్టడీలోకి ఇవ్వాలని ఈ నెల 4న తీర్పు ఇచ్చింది . అయితే ఈ నెల 4న పోలీస్ కస్టడీలోకి నిందితులను తీసుకున్నారు పోలీసులు. ఇక ఆ తర్వాత పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. అయితే దిశ కేసును రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు తన వద్ద నుంచి పారిపోయేందుకు తమ తుపాకులు లాక్కుని దాడి చేయడం వల్ల ఎన్కౌంటర్ చేయక తప్పలేదని సీపీ సజ్జనార్ దిశ కేసులోని నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై వివరణ  ఇచ్చారు. 

 


 అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ముమ్మర విచారణ చేపడుతుంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ పై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది అంతేకాకుండా హైకోర్టు కూడా దిశ నిందితుల ఎన్కౌంటర్ తప్పు అంటూ దాఖలైన పిటీషన్పై విచారణ చేస్తుంది. అయితే ఇప్పటికే జాతీయ మానవ హక్కుల బృందం ఆధ్వర్యంలో దిశా  అత్యాచార నిందితులకు పోస్టుమార్టం జరిగింది. అంతేకాకుండా నిందితుల తల్లిదండ్రులు సహా దిశా  తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. 

 


 అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో పలువురు పోలీసులు కూడా గాయాలైన విషయం తెలిసిందే. గాయపడిన కొందరు పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... పోలీసులకు తగిలిన  గాయాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం వారిని   వివరాలు అడిగి  తెలుసుకున్నది . ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు విచారించి పలు వివరాలు సేకరించింది. కాగా నిందితులు కేసూ  కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు  తమ నుండి పారిపోయిన తీరును   పోలీసులు వివరించారు. తమ నుంచి పారిపోయేందుకు అకస్మాత్తుగా కర్రలతో రాళ్లతో పై దాడి చేసి తుపాకీలు లాక్కున్నారని  పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు తమపై  తుపాకీతో  కాల్పులకు తెగబడ్డారని ... ఈ క్రమంలోనే తమ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా నిందితులు పోస్టుమార్టం రిపోర్టు సీసీటీవీ ఫోటేజ్ లను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు అందజేశారు పోలీసులు

మరింత సమాచారం తెలుసుకోండి: