రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలన్ని  జగన్ ప్రభుత్వం పై గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులకు గిట్టుబాటు ధరను కల్పించకుండా జగన్ సర్కార్ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని...  రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలు గుప్పించారు. అటు ఎంతో మంది టీడీపీ నేతలు సైతం పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో జగన్ సర్కారు అలసత్వం వహిస్తుందని విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. 

 


 వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత వల్ల... ఆరు నెలల పాలన లోనే 260 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని టిడిపి నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.రైతులు  ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలోని రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు  నిద్రపోతుంది అని  టిడిపి నేత నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని రైతుల సమస్యలపై స్పందించి పరిష్కరించాలని... రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించాలని నారా లోకేష్ జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు.. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు నెలలుగా రైతులను దగా చేస్తూనే ఉందని ... ఈరోజు రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా అసెంబ్లీ ముందు నిరసన తెలిపామని నారా లోకేష్ లోకేష్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు అసెంబ్లీలో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ టీడీపీ నేతలు అధికార వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా అటు అసెంబ్లీలో  టిడిపి వైసిపి ప్రశ్నోత్తరాలతో రసాభాసగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: