కొన్నేళ్లుగా మన దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ మరియు పలు రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో బడుగు మరియు బలహీన వర్గాల వారికి ఆకలి బాధ లేకుండా నెలసరి బియ్యం మరియు కొన్ని ఇతర సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కొన్నేళ్ల క్రితం ఆధార్ కార్డు అమల్లోకి రావడం అలానే ఆ కార్డు ని అన్ని అవసరాలకు తప్పని సరి చేయడం జరిగింది. కొద్దిరోజుల క్రితం రేషన్ కార్డు కలిగి ఉండి ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నవారు అందరూ కూడా తమ ఆధార్ కార్డు ని రేషన్ కార్డు తో లింక్ చేసుకోవడం తప్పని సరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ పద్ధతి ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియకపోవడం, దానితో కొందరి రేషన్ కార్డులు తీసివేయబడడం వంటి ఘటనలు మధ్యలో జరుగుతున్నాయి.

 

కాగా ఇటీవల 
ఝార్ఖండ్ లోని కరిమతి గిరిజన ప్రాంతంలో సిమ్ డేగా అనే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ సంతోషి అనే బాలిక 2017 సెప్టెంబరు 28 న అన్నడం లేక ఆకలితో మరణించింది. ఆధార్ కార్డు లేని కారణంగా తమకు రేషన్ తిరస్కరించబడిందని, ఈ కారణంగానే సంతోషి ఆకలి చావుకు బలైందని ఆమె తల్లి కొయిలీ దేవి, సోదరి గుడియా దేవి ఒక పిల్ ని సుప్రీం కోర్ట్ లో దాఖలు చేశారు. ఆధార్ లేనందున తమ కుటుంబ రేషన్ కార్డును అధికారులు రద్దు చేశారని వారు పేర్కొన్నారు. అయితే వారి వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీం కోర్ట్, కేంద్రప్రభుత్వానికి మరియు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత చురకలు అంటించేలా తీర్పును ఇచ్చింది. సీజేఐ జస్టిస్ బాబ్డే ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట, ఆధార్ లేదన్న సాకుతో ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోవడం తగదని పేర్కొనడం జరిగింది. అందువల్లే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తప్పనిసరిగా దీనికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండాలని, 

యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పడుకొనే : ఆలోచింపచేసేలా సాగిన 'ఛపాక్' ట్రైలర్......!!

అలానే ఈ అంశాన్ని పరిశీలించేందుకు తాము ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, ఇందుకు తగినవారి పేర్లను సూచించాలని ఆయన పిటిషనర్ తరఫు న్యాయవాదిని కోరారు. ఇక కేంద్రం తరఫున వాదించిన లాయర్ జనరల్ తుషార్ మెహతా, వాస్తవానికి ఇటీవల జరుగుతున్న కొన్ని మరణాలు కేవలం ఆకలి చావుల వలన జరిగినవి కావని, ఆ విధంగా సంతోషి తల్లి వేసిన పిటీషన్ కూడా అటువంటిందేనని వాదించారు. అందరికీ ఆహార పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ సర్క్యులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు. కాగా సుప్రీం నిర్ణయంతో అతి త్వరలో ఏర్పాటు కానున్న కమిటీ రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తుందని తెలిపారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: