హైదరాబాద్ షాద్నగర్ వైద్యురాలు దిశ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఘటనపై ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది. దిశ కేసులోని నలుగురు నిందితులను అతి దారుణంగా శిక్షించాలి అంటూ దేశ ప్రజానీకం మొత్తం నిరసన బాట పట్టింది. దేశంలో ఎక్కడ చూసినా నిరసన సెగలు భగ్గుమన్నాయి. ఎట్టి పరిస్థితిలో దిశా నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించి చంపాలి అని  డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం . కామంతో కళ్ళు మూసుకుపోయాయిన మృగాల్లాంటి  మగాళ్లు  మరోసారి ఆడపిల్లలపై చేయి  వేయాలంటేనే భయపడేలా దిశా నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి చెప్పారు. 

 


 దిశా  కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయటంపై దేశమంతా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఒక ఆడపిల్ల ను అత్యాచారం చేసిన  నిందితులను  ఎన్కౌంటర్ చేయడంపై కెసిఆర్ ప్రభుత్వం,  సీపీ సజ్జనార్ పై   ప్రశంసలు వెల్లువెత్తాయి . దిశా  కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం భవిష్యత్తులు ఆడపిల్లలపై అత్యాచారాలు చేయాలనుకునేవారికి ఒక హెచ్చరిక గా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎన్కౌంటర్ పై పలువురు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని  దిశగా నిందితుల ఎన్కౌంటర్ జరిగింది అంటు  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 


 ఇదిలా ఉండగా తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే నిందితుల ఎన్కౌంటర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలేరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత దిశా  ఎన్కౌంటర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దిశా  నిందితుల ఎన్కౌంటర్ చాలా బాధాకరం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్కౌంటర్ లో చనిపోయిన నిందితుల తల్లిదండ్రులు ఎంతో బాధ పడి ఉంటారని వారికి తన ప్రగాఢ సానుభూతి అంటూ కామెంట్ చేసింది ఆలేరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్థానిక ప్రజలు అందరూ భగ్గుమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: