ఏపీలో ఈ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజున కూడా చాలా దూకుడుగా సాగుతున్నాయి. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం వేడి వేడిగా నడుస్తోంది. ఇలా సభ జరుగుతున్న సమయంలోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఇకపోతే ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన కొంత ఇబ్బందిగా కనిపించారు.. అలాంటి సమయంలోనే ఉన్నట్టుండి బీపీ పెరగడంతో.. సమావేశాలు జరుగుతుండగానే ఆయన మధ్యలో నుంచి బయటకు వచ్చి.. వైఎస్సార్‌సీపీఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు.

 

 

ఆయన అవస్ద చూసిన అక్కడున్న సిబ్బంది వైద్యులకు సమాచారం అందించారు.. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని వైఎస్సార్‌సీపీఎల్పీ కార్యాలయంలోనే పరీక్షి అక్కడే ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు, అనంతరం ఆయన్ను మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వైద్యులు ఎమ్మెల్యే కోటంరెడ్డి కి బీపీ రావడంతో అస్వస్థకు గురయ్యారని, భయపడాల్సిన పని లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

 

ఈ విషయాన్ని పక్కన పెడితే వైఎస్సార్‌సీపీలో చేరేందుకు 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు షరతులు ఉన్నా తమ పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని.. కోటంరెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది జగన్‌ పుణ్యమే అని తెలిపారు.

 

 

ఇకపోతే 2024లో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని.. అప్పటివరకు టీడీపీకి మూడో స్థానమేనని వ్యాఖ్యానించారు. ఇకపోతే ఏపీ అసెంబ్లీకి ఉల్లిఘాటు తాకింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ మధ్య హాట్, హాట్‌గా చర్చ సాగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఏపీలో మాత్రమే సబ్సిడీ కింద ఉల్లి అందిస్తున్నామని మంత్రులు మోపిదేవి వెంకట రమణ, కన్నబాబు, కొడాలి నానిలు వివరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: