మీరు ఉద్యోగం చేస్తున్నారా అయితే కేంద్ర ప్రభుత్వం మీకు ఒక శుభవార్త చెప్పే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. అది ఎలా అంటే కేంద్ర క్యాబినెట్ సోషల్ సెక్యూరిటీ కార్డ్ బిల్లు 2019 కు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటివరకు సంఘటిత రంగాలలో పని చేసే ఉద్యోగులకు మూల వేతనంలో ఖచ్చితంగా 12 శాతం ప్రావిడెంట్ ఫండ్ కింద ప్రతి నెల కట్ అవుతుంది.

 

ఇది ఉద్యోగులు పొదుపు చేసే మార్గంలో ఒకటి. మనం కావాలంటే దీన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. కానీ, దీని కంటే తగ్గించే అవకాశం మాత్రం ఇన్ని రోజులు ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వలేదు.

 

 మామూలుగా ఉద్యోగి నుంచి తీసుకున్న 12 శాతానికి ఉద్యోగి మరో 12 శాతం వాటా పని చేసే సంస్థ ఆ ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. 15 వేల కంటే జీతం ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి పీఎఫ్ నిబంధనలు వర్తిస్తాయి. 12 శాతం కంటే తక్కువ కట్ చేసుకునే వెసులుబాటు త్వరలోనే తీసుకుని రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వాటా ఎంత మేర తగ్గిస్తాడు అనేది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. మరో వైపు పనిచేసే సంస్థ ఇచ్చే వాటిలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఈ సందర్భంగా తెలిసింది.

 

 ప్రస్తుతం దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేల ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక బలం చేకూర్చేలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ దీని వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఏమిటంటే పొదుపు తగ్గితే పన్ను మినహాయింపులు కూడా తగ్గే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. దీనిపైన స్పష్టత మాత్రం కొన్ని రోజుల్లోనే వస్తుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: