కొందరికి కొన్ని పనులు చేయడం రాదు వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా అందులో సఫలం కాలేరు. సరిగా ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లు ఉంది. ఎప్పుడు అధికారం చేపట్టని శివసేన పార్టీ తొలిసారి పదవి చేపట్టింది కానీ దాని సరిగా నిర్వహించలేకపోతుంది. దేశ రాజకీయాలలోనే ఒక నెల రోజుల పాటు చర్చనీయాంశంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికలు. ఎన్నో మలుపులు తిరిగిన తరువాత కాంగ్రెస్-ఎన్సీపీ- శివసేన కూటమి లో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఇప్పటికే దాదాపు 15 రోజులు అవుతుంది. కానీ ఇప్పటివరకు క్యాబినెట్ ఏర్పడలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయనతో పాటు ఆరు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ వారికి కూడా ఇప్పటివరకు శాఖల కేటాయింపు జరగలేదు. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా జరగడం లేదు.

 

 శివసేన నాయకుడే మహారాష్ట్ర సీఎం గా ఉండాలని పంతం నెగ్గించుకున్నారు. కానీ, ఆ  దూకుడుని ఇప్పుడు ప్రదర్శించలేకపోతుంది శివసేన పార్టీ. దానికి కారణం మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒక పార్టీ అయితే వెంటనే తీసుకుంటారు, కానీ ఇక్కడ ఏర్పడింది కూటమి ప్రభుత్వం కాబట్టి ఏ పని చేయాలన్నా ముగ్గురు మద్దతు కచ్చితంగా కావాల్సిందే. మంత్రుల విషయం కాబట్టి ఖచ్చితంగా వారి డిమాండ్లు ఉంటాయి. ఏ శాఖ ఎవ్వరికీ ఇవ్వాలని మూడు పార్టీలు కూర్చొని మాటలాడుకొని ఆ తర్వాత పంచుకోవాల్సి ఉంటుంది.

 

హోం మంత్రి - ఆర్థిక మంత్రి - రెవెన్యూ శాఖ.. ఈ మూడు పదవుల విషయంలో మూడు పార్టలూ పోటీ పడుతూ ఉన్నాయి. కీలకమైన ఈ మూడు పదవులనూ ఒక్కో పార్టీ ఒక్కోటి తీసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నాయి.కానీ ఆదిలోనే ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు అంతాలు ఉంది ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: