ఫేస్బుక్  ట్విట్టర్ వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమాచారాన్నిఅందిచడం అత్యంత సులభంగా మారింది.ఇక రాజకీయ వేత్తలు ఐతే తమ రాజకీయాల కోసం సోషల్ మీడియా ను బాగా ఉపయోగిస్తున్నారు   తమ కార్యకర్తలు, అభిమానులతో అనుసంధానం కావడం.. అలాగే నెటిజన్లు తమ నచ్చిన నేతల గురించి ట్వీట్లు చేయడం ఇటీవల కాలంలో ఎవరి  ఊహకు అందని విధంగా మారింది.

 

భారత్ లో 2019లో ట్విట్టర్‌లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు వీరేనని ట్విట్టర్ పేర్కొంది . వరుసగా  రెండోసారి అధికారాన్ని చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ ఇండియాలో తన ట్విట్ లతో అత్యంత ఎక్కువగా ప్రభావం చూపించిన వారిలో మొదటి స్థానంలో ఉన్నారు . దేశంలో 370 ఆర్టికల్ రద్దు, భారత, పాక్ సరిహద్దు ప్రాంతంలో వైమానిక దాడులు చేయడం, అలాగే అయోధ్య తదితర అంశాలు అన్నిటితో ప్రధాని మోదీని  పేరు వార్తల్లో బాగా వినిపించాయి దీనితో. నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిచ్చారు

 

.ఇక మోడీ తర్వాత  ట్విట్టర్‌లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తిగా  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండోస్థానంలో ఉన్నారు . చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలతో పరువు నష్టం దావాను ఎదుర్కొని కోర్టు మొట్టికాయలతో సరిపెట్టుకొన్నారు రాహుల్ . అలాగే తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలిలో ఓటమి పాలు కావడం లాంటి విఫలమైన అంశాలు కూడా కాంగ్రెస్ అధినేత గురించి మాట్లాడుకునేలా చేసాయి .వీరిద్దరి తర్వాత  అత్యంత ప్రభావం చూపిన వ్యక్తిగా  మూడోస్థానంలో అమిత్ షా నిలిచారు.

 

జమ్ము, కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, పౌరసత్వ సవరణ బిల్లు లాంటి అంశాల విషయంలో అమిత్ షా అనుసరించిన వ్యూహాలు మొదలైన వాటి గురించి  ట్విట్టర్‌లో నెటిజన్లు మాట్లాడుకునేలా చేశాయి.ట్విట్టర్‌లో మోస్ట్ ట్వీటెడ్ పర్సనాలిటీలలో నాలుగో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, ఐదో స్థానంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆరో స్థానంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఏడోస్థానంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎనిమిదో స్థానంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, 9వ స్థానంలో క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్, 10వ స్థానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లు నిలబడ్డారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: