గత కొన్ని రోజుల క్రితం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సినిమాటిక్ రేంజ్ లో ఒక కారు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి ఎగిరి చెట్ల లో నుంచి దూసుకుంటూ బయో వర్సిటీ ఫ్లైఓవర్ కింద ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళ పై పడింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... అక్కడి ప్రజలు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.కాగా  బయోడైవర్సిటీ ప్రమాదానికి   సంబంధించి కీలక మలుపులు చోటు చోటు చేసుకుంది . బయోడైవర్సిటీ ప్రమాదానికి కారణమైన నిందితున్ని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డిసెంబర్ 12వ తేదీ వరకు ప్రమాద ఘటనకు కారణమైన నిందితుని అరెస్టు చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. 

 


 ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అతివేగంగా కారు నడుపుతున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కల్వకుంట్ల కృష్ణవిలాస్ రావు పై  పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు నిర్లక్ష్యంగా ర్యాష్ గా కారు నడపడం వళ్లే వలన ఈ ఘోర ప్రమాదం  జరిగిందని అతని పై అభియోగం మోపి కేసు నమోదు చేశారు. కేవలం 40 కిలోమీటర్ల స్పీడుతో మాత్రమే వెలసిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ఏకంగా 105 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ప్రమాదానికి కారణం అయినందుకు  అతనికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.కాగా  ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాది హైకోర్టు పలు కీలక వాదనలు  వినిపించారు. 

 


 ఫ్లైఓవర్ 'ఎస్' ఆకారంలో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని... తన క్లయింట్ కేవలం 50 కిలోమీటర్ల వేగంతో కారు నడపాడంటూ  వాదించారు నిందితుడు తరపు న్యాయవాది. బయో వర్సిటీ ఫ్లైఓవర్ డిజైన్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని... ఇంతకుముందు కూడా... ఆ ఫ్లైఓవర్పై ఒక ప్రమాదం జరిగి ఇద్దరు మరణించారు అంటూ కోర్టులో వాదన  వినిపించారు నిందితుడి  తరపు న్యాయవాది. అయితే నిందితుల తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు... బయోవర్సిటీ ఫ్లైఓవర్ డిజైన్ లోపం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఇంతకుముందు కూడా ఒక ప్రమాదం జరిగే ఇద్దరు మృతి చెందారు అంటూ నిందితుడు చేస్తున్న ఆరోపణలపై స్పందించి వివరణ ఇవ్వాలి  అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది తెలంగాణ హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: