ఆ దేవుడు మనిషిని సృష్టించి తనకు బదులుగా అమ్మను భువికి పంపారని అంటారు.  తొమ్మిది నెలలు తన కడుపులో భద్రంగా మోసి జన్మనిచ్చి మనం చనిపోయే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ.  అమ్మ గురించి ఎంతో మంది కవులు తమ కవితల్లో పొగిడారు.. ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రపంచంలో ఆ దేవుడే వచ్చినా.. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలరంటారు.  తాజాగా ఓ క్రీడాకారిని తన ఏడు నెలల బిడ్డను తనతో పాటు తీసుకు వచ్చింది.. అయితే ఆట విరామ సమయంలో తన బిడ్డకు పాలు ఇచ్చి తన మాతృప్రేమను చాటుకుంది.  వివరాల్లోకి వెళితే.. 2019 మిజోరం రాష్ట్ర క్రీడల్లో లాల్వెంట్లువాంగీ సెర్చిప్ జిల్లా తుయికుం వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

 

ఇటీవల జరిగిన మొదటి పోటీకి ఆమె తన ఏడు నెలల బిడ్డను వెంట తీసుకొచ్చింది. ఆటలో అలసి పోయినా.. ఆట విరామంలో తన బిడ్డ వద్దకు వెళ్లి పాలు ఇచ్చి నిద్రపుచ్చి తిరిగి తన ఆటకు వెళ్లింది. తుయికుం తన బిడ్డకు పాలు ఇవ్వడం ఫోటో తీసి నింగ్లున్ హంఘల్ అనే మహిళ ఈ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.  దాంతో నెటిజన్లు ఆమె మాతృత్వానికి ఫిదా అయ్యారు. ఇమె మనసున్న తల్లి  అందుకే, ఓ పక్క ఆడుతూనే తన బిడ్డ ఆకలి తీర్చుతూ అమ్మ మనసు గొప్పతనానికి నిదర్శనం అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ ఫోటో మిజోరం క్రీడా మంత్రి రాబర్ట్ రొమావియాను కూడా ఆకట్టుకుంది.

 

దీంతో ఆయన ఈ చిత్రాన్ని మిజోరం స్టేట్ గేమ్స్-2019కు మస్కట్‌ ఉపయోగిస్తమన్నారు.  2019 మిజోరం రాష్ట్ర క్రీడల మస్కట్‌‌గా ఆ ఫోటోను ఉపయోగిస్తమని తెలిపారు. అలాగే, ఆమెను రూ.10 వేలు నగదు బహుమతితో సత్కరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆమె క్రీడా స్ఫూర్తికి, అమ్మ ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెల్యూట్ లాల్వెంట్లువాంగీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: