గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ...అసెంబ్లీలో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. అయితే అధికారం శాశ్వతం కాదు కాబట్టి..ఐదేళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. అత్యధిక మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇక అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో...టీడీపీని, చంద్రబాబుని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. టీడీపీ ఏం మాట్లాడినా....వైసీపీ వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తుంది.

 

అయితే టీడీపీలో వంశీని తీసేస్తే 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో అనుభవం ఉన్నవారు ఎక్కువే ఉన్నారు. ఏదొక విధంగా వైసీపీని ఎదురుకోవాలని చూస్తున్న వారి వల్ల కావడం లేదు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరీ, నిమ్మల రామానాయుడు ఇలా ఎవరు మాట్లాడిన వారికి గట్టి కౌంటర్లు పడిపోతున్నాయి. ఇక చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సెటైర్లు వేస్తున్నారు.

 

ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయాలనుకున్న అవి రివర్స్ అవుతున్నాయి. గత ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని వైసీపీ ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు ఏదో తప్పక అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే టీడీపీకి ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో వారికి వారికే సరైన అవగాహన లేదు. 

 

ఈ 22 మందిలో అసెంబ్లీకి 15 మంది వరకు వస్తున్నారు. మళ్ళీ వచ్చిన వాళ్ళలో కూడా అచ్చెన్నా, రామానాయుడు లాంటి వారే ఎక్కువ మాట్లాడుతున్నారు తప్ప...మిగిలిన వారు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఏం మాట్లాడితే వైసీపీ ఏం కౌంటర్లు ఇస్తుందనే భయంతో ముందుకు రావడం లేదు. ఇక అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రతి సబ్జెక్ట్ లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు తేలిపోతున్నారు. 

 

వైసీపీని ఇరుకున పెట్టె ప్రశ్నలు వేయడంలో విఫలమవుతున్నారు. అటు ఏదైనా ప్రశ్నలు వేసిన...వైసీపీ గత ఐదేళ్ల పాలనని ఉదాహరణగా చెబుతుండటంతో టీడీపీ ఎమ్మెల్యేలకు ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. మొత్తం మీద చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా తేలిపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: