కాలం కలిసిరాకపోతే అరటిపండు తిన్న పళ్ళు ఊడిపోతాయి అంటా....! అలాగే ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా కాలం అసలు కలిసి రావడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి బాబు ఏం చేసిన సక్సెస్ అవ్వకపోగా, ఎదురు ఇంకా పరువు పోతుంది. ఇప్పటికే చంద్రబాబుకు ఉన్న పేరు చాలావరకు పోయింది. ఇందులో ఆయన చేసిన పనుల వల్లే ఎక్కువ పరువు పోయింది. తాజాగా కూడా బాబు ఒక విషయాన్ని భుజాన వేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేద్దామని అనుకున్నారు. కానీ అది రివర్స్ అయ్యి బాబు పరువు పోయేలా చేసింది.

 

అయితే బాబు పరువు ఇంతలా పోయేలా చేసిన ఘటన ఏంటంటే? గత కొన్ని రోజులుగా ఉల్లి ధరల పెరుగుదలతో ఏపీ ప్రభుత్వం రైతు బజార్లలో రూ. 25కే కిలో ఉల్లి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రజలు క్యూ లైన్లలో ఉంటూ...ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుడివాడ రైతు బజార్ లో ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ఏ విధంగా చనిపోయాడు..ఎక్కడ చనిపోయారు అని లేకుండా టీడీపీ నేతలు, చంద్రబాబు భజన మీడియా ఉల్లి కోసం క్యూ లైన్ లో ఉండే వృద్ధుడు చనిపోయాడని సృష్టించారు.

 

ఇక ఇదే విషయంపై అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. అలాగే చనిపోయిన వ్యక్తి కుటుంబం మీడియాతో మాట్లాడిన వీడియోని అసెంబ్లీలో ప్లే చేసి చూపించారు. అసలు ఆ రిటైర్డ్ ఉద్యోగి ఉదయాన్నే వాకింగ్ నుంచి వస్తూ....రైతు బజార్లో తాజా కూరగాయాలని కొనుగోలు చేద్దామని వెళ్లారు. ఈ క్రమంలోనే హార్ట్ స్ట్రోక్ రావడంతో కన్నుమూశారని బంధువులు చెప్పారు. అయితే రియాలిటీలోకి వెళితే ఇది నిజమే అని తేలింది. ఆయన అసలు ఉల్లి కోసం వెళ్లలేదు. ఏదో మంచి కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.

 

అయితే చంద్రబాబు మాత్రం అసలు విషయం తెలుసుకోకుండా జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చివరికి అసెంబ్లీలో అసలు విషయం బయటపడేసరికి చంద్రబాబుకు ఉన్న పరువు కాస్త పోయింది. ఇలా బాబు ఏదో అనుకుని గుడ్డిగా వెళ్లడంతో ఉన్న పరువు కూడా పోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: