డబ్బు డబ్బు డబ్బు... ప్రతి ఒక్కరికి దీనితోనే అవసరం.  ఇది లేకుంటే ఒక్కపని కూడా ముందుకు సాగదు.  అంగీకరించే మనస్తత్వం లేకున్నా అంగీకరించాల్సిన సత్యం ఇది.  తప్పదు.  ఎందుకంటే నిత్యం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకోబోయే వరకు డబ్బు దూరని చోటు లేదు.. చేయని మ్యాజిక్ లేదు.  డబ్బు ఉన్న వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తే అవి లేని వ్యక్తులు మరోలా ఉంటారు.  


డబ్బుతో పనిలేదు.. ఏదైనా సంకల్పం ఉంటె సాధించవచ్చు అని చెప్పిన వ్యక్తులు డబ్బులు లేకుండా ఒక్కపూట కూడా గడపలేరు.  ఎందుకంటే, ఏం చేయాలన్నా డబ్బు కావాల్సిందే కదా.  డబ్బు రూపం ఒక్కటే... దాని ప్రతి రూపాయలు మాత్రం అనేకం.  ఒక్కో  విధానంలో ఒక్కోరకమైన పేరుతో డబ్బును పిలుస్తుంటారు.  ఇప్పుడు డబ్బును పూజ గదిలో ఉంచి పూజ చేస్తే దాన్ని లక్ష్మీదేవిగా పిలుస్తారు.  


లక్ష్మీదేవికి డబ్బు ఒక ప్రతి రూపం అన్నమాట.  లక్ష్మీదేవి కరుణిస్తేనే డబ్బు ఇంట్లో ఉంటుంది.  లేదంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది.  అందుకే ఇల్లు చక్కగా ఉండాలి అంటే ఇంట్లో ఉండే వ్యక్తులు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి చక్కగా పూజ చేసుకోవాలని అంటారు.  ఇక పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చేది వరకట్నం.  అదే గతంలో వధువుకు వరుడు కన్యాశుల్కం పేరుతో డబ్బు ఇస్తుంటారు.  


అలానే ప్రభుత్వానికి ప్రజలు డబ్బులను పన్ను రూపంలో చెల్లిస్తుంటారు.  ఈ రూపంలో చెల్లించేది డబ్బే కానీ, అది పన్ను రూపంలో ఉంటుంది.  స్కూల్, కాలేజీ పిల్లలకు ఫీజుల రూపంలో డబ్బును చెల్లిస్తూ ఉంటారు.  ఏదైనా తప్పు చేసి శిక్ష పడినపుడు జరిమానా రూపంలో డబ్బు కడతారు.  అదే విధంగా బిల్లులు లెట్ గా కట్టే సమాయంలో బ్యాంకు ఫైన్ వేస్తుంటాయి.  డబ్బును బ్యాంకులకు ఫైన్ రూపంలో అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది.  ఒకటే డబ్బుకు ఎన్నో రూపాల్లో మనుగడ సాగిస్తోంది.  ఈ కలియుగం మొత్తం ఇప్పుడు ఈ డబ్బు చుట్టూనే కదా తిరుగుతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: