దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై దాదాపు అన్ని వర్గాల నుంచి పోలీసులపై ప్రశంసల వర్షం కురిసింది. చట్టప్రకారం ఎలా ఉన్నా..పోలీసులు చేసింది మంచి పనే అని చాలామంది పొగిడారు. పోలీసుల రూపంలో దేవుడే వచ్చి వారిని శిక్షించాడని కూడా కొందరు కామెంట్ చేశారు. కానీ.. కొందరు మాత్రం ఎన్ కౌంటర్ చేయడాన్ని తప్పుబట్టారు. అలాంటి వారిలో క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఒకరు.

 

తాజాగా ఆమె తన క్రీడా అకాడమీ లోగో ఆవిష్కరణ వేళ కూడా దీనిపై కామెంట్ చేశారు. తన దృష్టిలో దిశకు సరైన న్యాయం జరగలేదని గుత్తా జ్వాల అన్నారు. ఎన్‌కౌంటర్లు, ఉరిశిక్షలు అత్యాచారాలను ఆపలేవని గుత్తా జ్వాలా అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుత్తా జ్వాల సూచించారు. అత్యాచారాలకు మూల కారణాలు వెదికి పరిష్కరించాలని ఆమె సూచించారు.

కోరికలతో కాలిపోయే నలుగురు భామలతో ఒక్కడే మగాడు.. ఎలా తట్టుకున్నాడో..?

యువతకు విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు కల్పించి.. సమాజంలో మార్పు తెచ్చినపుడే రేపులు, నేరాలు తగ్గుతాయని గుత్తా జ్వారా అన్నారు. తాజాగా ఆమె గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో డిల్లీలో లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌రూడీ, బాక్సర్‌ విజేందర్‌సింగ్‌, రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

మొదట 14 బ్యాడ్మింటన్‌ కోర్టులతో గుత్తా జ్వాల తన అకాడమీని ప్రారంభిస్తారట. ఆ తర్వాత మిగిలిన కొన్ని క్రీడలకు మైదానాలు ఏర్పాటు చేసి గుత్తా జ్వాల అకాడమీ ద్వారా శిక్షణ అందిస్తామని గుత్తా జ్వాల వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమె ఏమన్నారంటే.. “ హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ సుజాత విద్యాసంస్థలో ఈ గుత్తా జ్వాల అకాడమీ ఏర్పాటు చేస్తున్నా.. ఇందుకు మా అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఉంది.

 

విశాలమైన మైదానంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ క్రీడా అకాడమీ ఏర్పాటైంది. నైపుణ్యం ఉన్నవాళ్లకు ఈ అకాడమీలో తప్పకుండా ప్రాధాన్యం ఉంటుంది. బ్యాడ్మింటన్‌ తర్వాత స్మిమ్మింగ్‌, క్రికెట్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ వంటి ఆటల్లోనూ కోచింగ్ ఇస్తామన్నారు గుత్తా జ్వాల.

మరింత సమాచారం తెలుసుకోండి: