గత అధికార పార్టీలకు భిన్నంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్….పార్టీ మారి వచ్చే ఏ నేత అయినా, తమ పదవులకు రాజీనామా చేసే రావాలని కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీలోకి వచ్చే ఏ ఎమ్మెల్యే అయినా పదవికి రాజీనామా చేయాలసిందే. అయితే ఈ కండిషన్ నుంచి తప్పుకునేందుకు జగన్ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. ఆ వ్యూహం మొదట వల్లభనేని వంశీతోనే మొదలుపెట్టారు. ఆయనని స్వంతంత్ర ఎమ్మెల్యేగా ఉంచేందుకు స్కెచ్ గీశారు.

 

దీనికి తాజా అసెంబ్లీ సమావేశాలే వేదిక అయ్యాయి. ఈ సమావేశాల్లో వంశీ మొదట టీడీపీకి కేటాయించిన సీటులోనే కూర్చున్నారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ... తాను టీడీపీ వాళ్ళతో ఉండలేనని, కాబట్టి తనకు వేరే చోట సీటు కేటాయించాలని స్పీకర్ ని కోరారు. అలాగే తాను నియోజకవర్గ ప్రజల కోసం రాజీనామా చేయలేనని, కనుక తనని స్వంతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించాలని అన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన స్పీకర్, అసెంబ్లీ రూల్స్ చూసి సీటు మారుస్తామని చెప్పారు. 

 

అలాగే నిబంధనలకు అనుగుణంగా ఆయనకు సీటు కేటాయించాలని స్పీకర్ శాసనసభా కార్యదర్శిని ఆదేశించారు. ఇక దీనిని బట్టి చూసుకుంటే వంశీని స్వంతంత్ర ఎమ్మెల్యేగా పరిగిణించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వంశీ విషయం క్లారీటీ రావడంతో పార్టీ  మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు కూడా ఓ దారి దొరికినట్లువుతుంది. వారు కూడా ఇలాగే వైసీపీకి మద్ధతు తెలిపి స్వతంత్ర ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు. అటు ఈ సమావేశాలకు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్ లు రావడం లేదు. వీరు బీజేపీలోకి వెళ్ళే అవకాశముందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. 

 

దీంతో వారు సైతం సభలో ఇదే విధంగా వంశీ రూటునే ఫాలో అయ్యే అవకాశం ఉంది. వారంతటగా వారు సభలో స్పీకర్ కు తమను టీడీపీ సభ్యులుగా కాకుండా..స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గుర్తించమని కోరే ఛాన్స్ ఉంది. ఈ విధంగా అటు అనర్హత వేటు..ఉప ఎన్నికలు తప్పించుకోవటమే కాకుండా.. తాము కోరుకున్న పార్టీకి అనధికారికంగా అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. మొత్తానికి టీడీపీని వీడే ఎమ్మెల్యేలకు వంశీ ఓ దారి చూపించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: