2012 డిసెంబర్ లో 23 ఏళ్ళ నిర్భయ దారుణ అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. 2012 డిసెంబర్ 16న ఢిల్లీ లో  ఆరుగురు కామాంధులు 23 ఏళ్ల నిర్భయపై అతి దారుణంగా అత్యాచారం చేశారు. కదులుతున్న బస్సులో మూకుమ్మడిగా  ఆరుగురు కామాంధులు  నిర్భయపై అత్యాచారం చేసి ఆమె మర్మాంగాల్లోకి   పదునైన వస్తువులు జొప్పించారు . దీంతో తీవ్ర గాయాలపాలైన నిర్భయ  చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. నిందితులను శిక్షించేందుకు నిర్భయ చట్టం అనే కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ నిందితులకు  ఇప్పుడు వరకు శిక్ష మాత్రం పడలేదు. 

 

 నిర్భయ అత్యాచార కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా... నిందితుల్లో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కాగా ఈ కేసులో మైనర్ గా తేలిన ఒక నిందితుడికి మూడేళ్ల శిక్ష మాత్రమే విధించారు. ప్రస్తుతం నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించాలని ట్రయల్  కోర్టు తీర్పు ఇచ్చింది... ఢిల్లీ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ క్రమంలో  ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారి అభ్యర్థనను తిరస్కరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అయితే గత కొన్ని రోజులుగా నిర్భయ హత్యాచారం కేసులోని నలుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు అయిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

 

 ఈ తరుణంలో నిర్భయ అత్యాచార నిందితుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్.. ఉరిశిక్ష తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు రివ్యూ పిటిషన్ వేయని అక్షయ్ కుమార్ సింగ్ తరుపు న్యాయవాది ఏపీ సింగ్ నేడు సుప్రీం  కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో గమనార్హం. ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యం జల కాలుష్యం కారణంగా తన  ఆయుష్షు తగ్గిపోతుందని కాబట్టి తనకు ఉరిశిక్ష విధించడం రద్దు చేయాలంటూ  అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్యం జల కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్భయ  కేసులో నిందితుడు కూడా ఢిల్లీలోని వాయు కాలుష్యం గురించి ప్రస్తావించడం గమనార్హం. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: